సై అంటే సై: నిరూపిస్తా.. విరుచుకుపడ్డ కాకాని, రాజకీయాలు వదిలేస్తా.. సోమిరెడ్డి
టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
నెల్లూరు: టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సోమిరెడ్డి అక్రమాస్తులను నిరూపించేందుకు తాను సిద్ధమని కాకాని చెప్పారు.

తన పైన కాకాని చేసిన ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ చేశారు. రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. అలాగే, తన పైన కాకాని చేసిన అవాస్తవ ప్రచారం పైన విచారణ జరిపించాలని నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
అంతకుముందు కాకాని మరోసారి సోమిరెడ్డిపై మండిపడ్డారు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే సోమిరెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. విదేశాల్లో సోమిరెడ్డికి ఉన్న ఆస్తుల సంగతిని పక్కన పెట్టి, మొదట దేశంలో ఆయనకు ఉన్న ఆస్తులపై వివరణ ఇవ్వాలన్నారు.
సోమిరెడ్డికి అక్రమాస్తులు ఉన్నాయని తాను చేసిన ఆరోపణలు తప్పని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. సోమిరెడ్డి ఆస్తులకు సంబంధించిన ఆధారాలంటూ మరికొన్ని పత్రాలను బుధవారం కాకాని మీడియాకు చూపించారు.
సోమిరెడ్డి కుమారుడికి మొత్తం తొమ్మిది కంపెనీల్లో పెట్టుబడులున్నాయని, ఓ పవర్ ప్రాజెక్టులో సోమిరెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారని ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని సోమిరెడ్డి నిరూపించలేకపోతే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలన్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications