చంద్రబాబుకు జగన్ షాక్: వైసిపిలో చేరిన టిడిపి మాజీ ఎమ్మెల్యే
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం షాకిచ్చారు. ఆపరేషన్ ఆకర్ష్‌తో పలువురు వైసిపి, కాంగ్రెస్ నేతలను టిడిపి ఆకర్షిస్తోంది.
శ్రీకాకుళం: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం షాకిచ్చారు. ఆపరేషన్ ఆకర్ష్‌తో పలువురు వైసిపి, కాంగ్రెస్ నేతలను టిడిపి ఆకర్షిస్తోంది. అయితే, జగన్ టిడిపి అసంతృప్త నేతలపై దృష్టి సారించారు.

వైసిపిలోకి పలువురు
ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నేతలు వైసిపిలో చేరారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో టిడిపి నుంచి మరో కీలక నేత జగన్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత వాసిరెడ్డి వరద రామారావు ఈ రోజు జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

జగన్‌కు ఘన స్వాగతం
వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు మద్దతుగా నిలిచేందుకు జగన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. రణస్థలంలో ఆయనకు వైసిపి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

టిడిపి నేతకు వైసిపి కండువా కప్పిన జగన్
ఈ సమయంలో జగన్.. వాసిరెడ్డికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మరికొంత మంది స్థానిక నేతలు కూడా కూడా వైసిపి తీర్థం పుచ్చుకున్నారు.

నేడు బహిరంగ సభ
కాగా, వంశధార ప్రాజెక్టు వల్ల నిర్వాసితులుగా మారిన 13 గ్రామాల బాధితులకు అండగా నిలిచేందుకు శ్రీకాకుళం పర్యటనకు జగన్ వచ్చారు.
రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి బాధితులను కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఈ సాయంత్రం హీరమండలంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.
-
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications