బంగారం ధరలో అనూహ్య పరిణామాలు: తగ్గినట్టే తగ్గి- షాకింగ్ ట్విస్ట్
బంగారం ధరల్లో నేడు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. పైపైకి దూసుకెళ్లాయి. 10 గ్రాముల బంగారం ధర ఒక దశలో 1,60,000 రూపాయల మార్క్ ను అందుకున్నట్టే కనిపించింది. దేశీయ డిమాండ్ తో పాటు క్షణక్షణానికి మారుతున్న కరెన్సీ రేట్లు.. బంగారం ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తోన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం వీటి వైపు జనం మొగ్గుచూపడం కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.
ఈ ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల పసిడి ఆల్ టైమ్ హైని తాకింది. రూ. 1,59,226ల వద్ద ట్రేడ్ అయింది. గురువారం నాటితో పోల్చుకుంటే ఒక్కపూటలో 11,000 రూపాయల వరకు పెరుగుదల కనిపించింది. ఈ ఉదయం ట్రేడింగ్ ఆరంభం నుంచే వీటి రేట్లు పెరుగుతూ పోయాయి. 1,56,531 రూపాయల వద్ద ట్రేడింగ్ మొదలైంది. తొలిగంటలో కొంత తగ్గుదల నమోదైంది గానీ అది నామమాత్రమే. ఉదయం 10 గంటల సమయానికి 1,57,682 రూపాయల ట్రేడ్ అయింది.

వెండిదీ ఇదే పరిస్థితి. కిలో వెండి ధర ప్రస్తుతం 3,31,089 రూపాయలుగా నమోదైంది. కిందటి రోజుతో పోల్చుకుంటే దాదాపుగా 3,000 రూపాయలు పెరిగింది. ఈ ఉదయం కిలో వెండి ధర ట్రేడింగ్ 3,25,826 రూపాయల వద్ద ట్రేడింగ్ ఆరంభం కాగా.. గరిష్ఠంగా 3,39,927 రూపాయలను తాకింది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,982, 22 క్యారెట్లు - రూ. 14,650, 18 క్యారెట్లు - రూ. 12,220
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,971, 22 క్యారెట్లు- రూ. 14,640, 18 క్యారెట్లు - రూ. 11,978
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,971, 22 క్యారెట్లు- రూ. 14,640, 18 క్యారెట్లు- రూ. 11,978
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,971, 22 క్యారెట్లు- రూ. 14,640, 18 క్యారెట్లు- రూ. 11,978
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,971, 22 క్యారెట్లు- రూ. 14,640, 18 క్యారెట్లు- రూ. 11,978
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,971, 22 క్యారెట్లు- రూ. 14,640, 18 క్యారెట్లు- రూ. 11,978
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications