కిస్ అండ్ రన్ 'క్రేజీ సుమిత్' అరెస్ట్
కిస్ అండ్ రన్ ఫ్రాంక్ అంటూ రోడ్డుపై వెళుతున్న అమ్మాయిలకు ముద్దు పెట్టి పారిపోయే వీడియోలు పోస్ట్ చేసిన క్రేజీ సుమిత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: కిస్ అండ్ రన్ ఫ్రాంక్ అంటూ రోడ్డుపై వెళుతున్న అమ్మాయిలకు ముద్దు పెట్టి పారిపోయే వీడియోలు పోస్ట్ చేసిన క్రేజీ సుమిత్ పోలీసులకు చిక్కాడు. ఢిల్లీ లోని కన్నాట్ ఏరియాలో ఇలా కిస్ అండ్ రన్ ఫ్రాంక్ వీడియో తీసి వెబ్ సైట్ లో పెట్టాడు సుమిత్.
ఇది మీడియా ద్వారా పోలీసులకు చేరింది. తాము మొదట సాంకేతికంగా విచారణ ప్రారంభించామని, యూట్యూబ్, ఫేస్ బుక్ లలో వీడియో ఉండడంతో ఆ దిశగా వ్విచారణ జరిపినట్లు ఢిల్లీ పోలీస్ అధికార ప్రతినిధి దీపేంద్ర పాఠక్ వెల్లడించారు.
పోలీసుల విచారణలో తొలుత సుమిత్ తన చర్యలను సమర్ధించుకోబోయాడని, నిజానికి సదరు వీడియోలో తాను ముద్దు పెట్టుకున్న అమ్మాయి తన టీం మెంబరే అని చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు.

అయితే అతడు చెప్పింది నిజమైనా కాకపోయినా.. సుమిత్ శిక్షార్హుడేనని వారు స్పష్టం చేస్తున్నారు. ఆ వీడియోలో ఉన్న యువతుల గురించి కూడా వెతుకుతున్నామని, వారి నుంచి కూడా ఫిర్యాదు స్వీకరిస్తామని చెబుతున్నారు.
సుమిత్ 2015 నుంచి యూట్యూబ్ లో ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. అయితే ఈ కిస్ అండ్ రన్ వీడియో పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో అతడు మరో వీడియో ద్వారా క్షమాపణ కూడా చెప్పాడు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications