భర్త మీద పగ: బిడ్డల ముందే మహిళ మీద గ్యాంగ్ రేప్, యాసిడ్ పోసి దారుణంగా !
పక్కింటిలో నివాసం ఉంటున్న వ్యక్తి మీద పగతో అతని భార్య మీద గ్యాంగ్ రేప్ చేసిన ఘటన మహారాష్ట్రలోని థాణే నగరంలో జరిగింది. 32 ఏళ్ల వివాహిత మహిళను ఆమె పిల్లల ముందే గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు.
థాణే: పక్కింటిలో నివాసం ఉంటున్న వ్యక్తి మీద పగతో అతని భార్య మీద గ్యాంగ్ రేప్ చేసిన ఘటన మహారాష్ట్రలోని థాణే నగరంలో జరిగింది. 32 ఏళ్ల వివాహిత మహిళను ఆమె పిల్లల ముందే గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు తరువాత ఆమె మీద యాసిడ్ పోశారు.
తీవ్రగాయాలైన బాధితురాలు పూణే నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని పోలీసులు చెప్పారు. కల్ఫాటౌన్ షిప్ ఏరియాలో 32 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నది. ఆమె భర్త ఆదివారం రాత్రి పని మీద ఊరికి వెళ్లారు. ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటిలో ఉంది.

ఆ సందర్బంలో అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న గోపాల్ శంకర్, శంషు హుస్సేన్, రంగప్ప భత్కట్, వెంకటేష్ పటేల్, ఆశ్వర్ రాముల్, శీర్షప్ప అనే నిందితులు మహిళ ఇంటిలో చొరబడ్డారు. తరువాత మహిళ ఇద్దరు పిల్లలను చున్నీలతో కట్టేశారు.
ఇద్దరు పిల్లల ముందే మహిళను గ్యాంగ్ రేప్ చేశారు. తరువాత కసి తీరకపోవడంతో వెంట తీసుకెళ్లిన యాసిడ్ ఆమె శరీరం మీద పోసి అక్కడి నుంచి పరారైనారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితురాలని ఆసుపత్రికి తరలించారు.
మహిళ మీద అత్యాచారం చేసి యాసిడ్ పోసిన గోపాల్ శంకర్, శంషు హుస్సేన్, రంగప్ప భత్కట్ అనే నిందితులను అరెస్టు చేశామని, మిగిలిన నిందితులు పరారైనారని పోలీసులు చెప్పారు. మహిళ భర్త మీద పగతోనే ఆమె మీద సామూహిక అత్యాచారం చేసి యాసిడ్ పోశారని పోలీసులు తెలిపారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications