Somaliland: ఆఫ్రికాలో ఇజ్రాయెల్ మంట-అరబ్ దేశాల ఫైర్-ఐరాస అత్యవసర భేటీ..!
ఎప్పుడో 1991లో సోమాలియా నుంచి వేరు పడి ఏ దేశమూ గుర్తించకపోవడంతో సొంత ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని, స్వయం పాలన చేసుకుంటున్న సోమాలీల్యాండ్ ను ఇప్పుడు ఇజ్రాయెల్ గుర్తించి కొత్త చిచ్చు రేపింది. హార్న్ ఆఫ్ ఆఫ్రికాగా పిలిచే తూర్పు ఆఫ్రికాలోని ద్వీపకల్పంలో భాగమైన ఈ సోమాలీ ల్యాండ్ కు గుర్తింపు ఇవ్వడం ద్వారా అంతర్జాతీయంగా తమకు మద్దతునిచ్చే దేశాల సంఖ్యను పెంచుకోవాలని, భవిష్యత్ వ్యూహాలకు కేంద్రంగా మార్చుకోవాలని ఇజ్రాయెల్ వేసిన ఎత్తుగడ ఇప్పుడు అరబ్ దేశాల్లో చిచ్చుకు కారణమవుతోంది. దీంతో ఈ వ్యవహారంపై ఐక్యరాజ్యసమితి అత్యవసర భేటీకి సిద్దమవుతోంది.
సోమాలీ ల్యాండ్ కథేంటి ?
సోమాలియా నుండి విడిపోయిన సోమాలిలాండ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో స్వయం ప్రకటిత రాష్ట్రం, ఇది సోమాలియా వాయువ్యంలో ఆడెన్ గల్ఫ్ వెంట, యెమెన్‌కు ఎదురుగా జిబౌటి సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకమైన ఎర్ర సముద్రం-గల్ఫ్ ఆఫ్ ఆడెన్ షిప్పింగ్ కారిడార్‌లో ఉంది. అలాగే ప్రధాన ప్రపంచ వాణిజ్య మార్గాలు, విదేశీ సైనిక స్థావరాలకు దగ్గరగా ఉంది. దీనికి తాజాగా ఇజ్రాయెల్ దేశంగా గుర్తించడంతో చిచ్చు రేగుతోంది. దశాబ్దాల తరబడి వాస్తవ స్వాతంత్ర్యం ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ తప్ప మరే దేశం ఇప్పటివరకు సోమాలిలాండ్‌ను అధికారికంగా గుర్తించలేదు. అయితే బ్రిటన్, టర్కీ, యూఏఈ, డెన్మార్క్, తైవాన్ అనధికారిక దౌత్య సంబంధాలను కొనసాగిస్తున్నాయి.

ఇజ్రాయెల్ గుర్తింపు-ముస్లిం దేశాల ఫైర్
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, విదేశాంగ మంత్రి గిడియాన్ సార్, సోమాలిలాండ్ అధ్యక్షుడు అబ్దిరెహ్మాన్ మొహమ్మద్ అబ్దుల్లాహి మధ్య పరస్పర గుర్తింపు ప్రకటనపై తాజాగా సంతకాలు జరిగాయి. ఈ చర్య అబ్రహం ఒప్పందాల స్ఫూర్తికి అనుగుణంగా ఉందని నెతన్యాహు ప్రకటించారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగే భేటీలో ఈ అంశాన్ని లేవనెత్తుతానని సంకేతాలిచ్చారు. దీన్ని సోమాలియా సహా 20పైగా అరబ్, ముస్లిం దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇది దూకుడు చర్య అని, దానిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది . త్వరలో సోమాలియా ఐరాస భద్రతా మండలి అధ్యక్ష పదవిని చేపట్టబోతోంది.
ఐరాస అత్యవసర భేటీ
సోమాలీల్యాండ్ కు గుర్తింపు ఇస్తూ ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయంపై చర్చించడానికి ఐరాస భద్రతా మండలి రేపు అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్‌తో పాటు 20కి పైగా దేశాలు ఇజ్రాయెల్ గుర్తింపును తిరస్కరించాయి. ఇది హార్న్ ఆఫ్ ఆఫ్రికా, ఎర్ర సముద్ర ప్రాంతంలో శాంతిభద్రతల్ని అస్థిరపరచగలదని హెచ్చరించాయి. సిరియా కూడా ప్రత్యేకంగా దీన్ని తప్పుబట్టింది. అదే సమయంలో అమెరికా కూడా ఇజ్రాయెల్ నిర్ణయానికి దూరంగా జరిగింది. అమెరికా ఈ వ్యవహారంలో తలదూర్చదని ప్రకటించింది. అయితే ట్రంప్ ఏర్పాటు చేసిన అబ్రహం ఒప్పందంలో దీన్ని భాగం చేస్తామని ఇజ్రాయెల్ ధీమాగా చెబుతోంది.

అబ్రహాం ఒప్పందం(Abraham Accord) ఏంటి ?
అబ్రహం ఒప్పందం 2020లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన ఒప్పందాల సమూహం. దీని ప్రకారం ఇజ్రాయెల్‌తో అరబ్ దేశాలు (యుఏఈ, బహ్రైన్, సుదాన్, మొరాకో) దౌత్య, వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకున్నాయి. ఈ ఒప్పందాల్లో సోమాలిలాండ్‌ను కూడా చేర్చుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కోరుతున్నారు. ఇది మధ్యప్రాచ్య-ఆఫ్రికా స్థిరత్వాన్ని పెంచుతుందని సోమాలిలాండ్ అధ్యక్షుడు చెప్తున్నారు. అయితే దీన్ని అరబ్ దేశాలు ఒప్పుకోవడం లేదు.
-
ఇజ్రాయెల్ భీకర ప్రతీకారం: హిజ్బుల్లా మాస్టర్‌మైండ్ హతం! -
సైలెంట్ కిల్లర్స్: ఇరాన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ఇజ్రాయెల్ 'యూనిట్ 8200'!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications