Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆపరేషన్ ఎజాక్స్: ఇరాన్ చరిత్రను మార్చేసిన అమెరికా కుట్ర.. అసలేం జరిగింది?

Operation Ajax: ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అమెరికా జోక్యం పట్ల పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో 72 ఏళ్ల క్రితం జరిగిన 'ఆపరేషన్ ఎజాక్స్'అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమెరికా వ్యూహాలు రచిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో 1953లో అమెరికా, బ్రిటన్‌లు కలిసి ఇరాన్‌లో చేసిన కుట్ర 'ఆపరేషన్ ఎజాక్స్' గురించి చర్చ మొదలైంది. అసలు 1953లో ఏం జరిగింది? అమెరికాకు దీనితో ఉన్న సంబంధం ఏంటి?

అసలేమిటీ ఆపరేషన్ ఎజాక్స్?
1950వ దశకంలో ఇరాన్ ప్రధానమంత్రిగా మొహమ్మద్ మొసాదేక్ ఉండేవారు. ఆయన ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడు, తీవ్ర జాతీయవాది. ఇరాన్ చమురు నిక్షేపాలను బ్రిటీష్ కంపెనీల గుప్పిట నుంచి విడిపించి, వాటిని జాతీయం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇది బ్రిటన్, అమెరికా దేశాలకు కంటగింపుగా మారింది. వారి ప్రయోజనాలు దెబ్బతింటాయని భావించి, మొసాదేక్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు పన్నిన రహస్య వ్యూహమే 'ఆపరేషన్ ఎజాక్స్'.

Operation Ajax How a US-British Coup Changed Iran s History Forever

కుట్ర వెనుక అసలు కారణాలు:
చమురుపై ఆధిపత్యం: ఇరాన్ చమురు బావులపై బ్రిటీష్ కంపెనీల పట్టును కాపాడుకోవడం.

రష్యా భయం: మొసాదేక్ సోవియట్ యూనియన్ (రష్యా) వైపు మొగ్గు చూపుతారని, ఫలితంగా ఇరాన్ చమురు రష్యా వశమవుతుందని అమెరికా భయపడింది.

అధికార మార్పిడి: మొసాదేక్‌ను తొలగించి అమెరికాకు అనుకూలంగా ఉండే మొహమ్మద్ రెజా పహ్లావీ (షా) ను పూర్తి అధికారంలోకి తీసుకురావడం.

ఏం జరిగింది?
1953 ఆగస్టులో అమెరికా గూఢచారి సంస్థ (CIA), బ్రిటన్ సంస్థ (MI6) కలిసి ఇరాన్ సైన్యాన్ని, షా మద్దతుదారులను ప్రోత్సహించాయి. దేశంలో అల్లర్లు సృష్టించి, ప్రజలను మొసాదేక్‌కు వ్యతిరేకంగా ఉసిగొల్పాయి. ఆగస్టు 19, 1953న సైనిక తిరుగుబాటు ద్వారా మొసాదేక్ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. మొహమ్మద్ మొసాదేక్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఆయన 1967లో గృహనిర్బంధంలోనే మరణించారు. షా అధికారంలోకి వచ్చారు. దీనికి కృతజ్ఞతగా ఇరాన్ చమురులో 40 శాతం వాటాను అమెరికా కంపెనీలకు అప్పగించారు. ఇరాన్‌లో సుమారు 25 ఏళ్ల పాటు అమెరికా అనుకూల నియంతృత్వ పాలన కొనసాగింది.

నేడు ఎందుకు చర్చనీయాంశమైంది?
ప్రస్తుతం ఇరాన్‌లో అలీ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి రావడం, అమెరికా వారికి మద్దతుగా నిలవడం చూస్తుంటే.. మళ్ళీ 1953 నాటి పరిస్థితులే కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆనాడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చిన అమెరికా, ఇప్పుడు ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అదే తరహా 'ఆపరేషన్' చేపడుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+