గెట్ అవుట్: నమ్మకమైన స్నేహితురాలికే ట్రంప్ షాక్.
డొనాల్డ్ ట్రంప్ కేబినెట్ లో వరుసగా వికెట్లు పడిపోతున్నాయి. గత నెలలో హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయమ్‌ను పక్కన పెట్టిన ట్రంప్, ఇప్పుడు ఏకంగా అటార్నీ జనరల్ పామ్ బాండీని పదవి నుంచి తొలగించారు. బాండీ ప్రైవేట్ రంగంలో ఒక "ముఖ్యమైన కొత్త బాధ్యత" తీసుకోబోతున్నారని ట్రంప్ పైకి చెబుతున్నా.. దీని వెనుక అసలు కథ వేరే ఉందని అంతర్గత వర్గాలు కోడై కూస్తున్నాయి. ప్రస్తుతానికి డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే తాత్కాలికంగా ఈ పగ్గాలను చేపట్టారు.
బుధవారం పామ్ బాండీతో ట్రంప్ జరిపిన ఏకాంత చర్చ అత్యంత "కఠినంగా" సాగిందని సమాచారం. తన రాజకీయ ప్రత్యర్థులపై విచారణలు జరపడంలో బాండీ వేగం పుంజుకోలేదని, ముఖ్యంగా మాజీ ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీ వంటి వారిపై ఆశించిన స్థాయిలో ప్రాసిక్యూషన్ జరగలేదని ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తనపై జరిగిన కుట్రలకు ప్రతీకారం తీర్చుకోవాలన్న ట్రంప్ ఎజెండాను అమలు చేయడంలో బాండీ విఫలమయ్యారనే ముద్ర పడటమే ఆమె పదవికి ఎసరు పెట్టింది.

ఎప్‌స్టీన్ కేసు.. ఒక అంతుచిక్కని మిస్టరీ!
బాండీ పదవి ఊడటానికి మరో ప్రధాన కారణం 'జెఫ్రీ ఎప్‌స్టీన్' కేసు ఫైళ్ల నిర్వహణ. ఒక ఇంటర్వ్యూలో "ఎప్‌స్టీన్ క్లయింట్ జాబితా నా డెస్క్‌పై ఉంది" అని బాండీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అయితే, తీరా చూస్తే అలాంటి జాబితా ఏదీ లేదని డిపార్ట్‌మెంట్ ప్రకటించడం ట్రంప్ వర్గాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ప్రభుత్వం ప్రజల నుంచి సమాచారాన్ని దాచిపెడుతోందనే అపవాదు రావడానికి బాండీ ప్రకటనలే కారణమని వైట్ హౌస్ వర్గాలు భావించాయి. దీనికి తోడు, ఈ నెల చివరలో హౌస్ ఓవర్‌సైట్ కమిటీ ముందు ఆమె సాక్ష్యం చెప్పాల్సి ఉండటం కూడా ఒక కీలక మలుపు.
తదుపరి అడుగు ఎటువైపు?
పామ్ బాండీ స్థానంలో ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (EPA) అడ్మినిస్ట్రేటర్ లీ జెల్డిన్‌ను నియమించాలని ట్రంప్ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విచిత్రమేమిటంటే, పదవి పోతుందన్న సంకేతాలు ఉన్నప్పటికీ, బుధవారం వరకు బాండీ అధ్యక్షుడితోనే గడిపారు. సుప్రీంకోర్టు వాదనలకు కూడా ఆయనతో కలిసే వెళ్లారు. సాధారణంగా ట్రంప్ అసంతృప్తిగా ఉంటే అధికారులు ఆయనకు దూరంగా ఉంటారు, కానీ బాండీ మాత్రం చివరి నిమిషం వరకు ఆయన వెంటే ఉండటం గమనార్హం.
మొత్తానికి, ట్రంప్ తన రెండో విడత పాలనలో 'విధేయత' కంటే 'వేగం', 'ఫలితాలకే' పెద్దపీట వేస్తున్నట్లు అర్థమవుతోంది. బాండీ నిష్క్రమణతో జస్టిస్ డిపార్ట్‌మెంట్‌లో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!













Click it and Unblock the Notifications