కేసీఆర్‌కు చంద్రబాబు షాక్: రూ.వేలకోట్ల బకాయిలు, తెలంగాణకు పవర్ కట్
తెలంగాణకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు తాము సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి రూ.4,449 కోట్ల బకాయి ఉందని తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది.
అమరావతి/హైదరాబాద్: తెలంగాణకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు తాము సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి రూ.4,449 కోట్ల బకాయి ఉందని తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది.
తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. మంగళవారం నుంచి విద్యుత్ నిలిపివేస్తున్నామని తెలిపింది. ఈ బకాయి మొత్తం వెంటనే చెల్లిస్తే విద్యుత్ సరఫరా చేస్తామని ఏపీ జనరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్.. స్పష్టం చేస్తూ తెలంగాణ ట్రాన్స్ కోకు లేఖ రాసింది.

కరెంట్ నిలిపేస్తున్నాం
విభజన అనంతరం బకాయిలు పెరిగిపోవడంతో తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన కరెంటును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయంలో రెండేళ్ల క్రితమే ఢిల్లీకి వెళ్లి జోక్యం చేసుకోవాలని హోంమంత్రిత్వ శాఖను కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

నోటీసులు
తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని చెబుతూ 25న ఆఖరిసారి నోటీసులు పంపించింది. తెలంగాణ నుంచి సుమారు రూ.4,500వేల కోట్లు రావాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

వేల కోట్ల బకాయి
ఏడాదికి రూ.1,128 కోట్ల చొప్పున ఇప్పటి వరకు రూ.4,449 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. అందులో రూ.1390 కోట్లు ఏపీనే తెలంగాణకు చెల్లించాల్సి ఉండటంతో దానిని మాఫీ చేసి రూ.3,138 కోట్లు చెల్లించాలని కోరింది.

భారీగా బిల్లులు పేరుకు పోవడంతో..
భారీ మొత్తంలో బిల్లులు పేరుకు పోవడంతో రోజువారీ ఆర్థిక కార్యకలాపాలను సైతం నిర్వహించడం కష్టంగా మారుతోందని జెన్ కో చెబుతోంది. దక్షిణాది రాష్ట్రాల లోడ్ డిస్పాచ్ సెంటర్ సహా కేంద్రం కూడా ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నిలిపేసినట్లు తెలిపింది.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications