శివాజీ అనసూయ కాంట్రవర్సీ.. అరియానా గ్లోరి దిమ్మతిరిగే రియాక్షన్!
నటుడు శివాజీ ఇటీవల దండోరా సినిమా ప్రచార వేదిక పైన మహిళల వస్త్రధారణ పైన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. మహిళల వస్త్రధారణను డిసైడ్ చేయడానికి మీరు ఎవరు అంటూ ఒక వర్గం రెచ్చిపోతుంటే, మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి కానీ బట్టలు విప్పుకొని బజార్లో తిరగడానికి కాదు అని మరొక వర్గం టార్గెట్ చేస్తుంది.
సోషల్ మీడియాలో ఆసక్తికరంగా రచ్చ
నటుడు శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తున్న వారు,అనసూయకు, చిన్మయికి మద్దతు పలుకుతున్న వారు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అయితే అనసూయ, చిన్మయి తో పోలిస్తే శివాజీ కి ప్రజల నుంచి మద్దతు పెరుగుతుంది. సోషల్ మీడియా శివాజీ చాలా మంచి విషయం చెప్పాడని, అతను తప్పుగా మాట్లాడిన మాటలకు క్షమాపణ కూడా చెప్పాడని, కానీ కావాలని కొందరు రాద్ధాంతం చేస్తున్నారు అంటూ మండిపడుతోంది.

అరియానా గ్లోరీ మద్దతు ఎవరికంటే
ఇక తాజాగా ఈ వివాదంపైన సోషల్ మీడియా సెలబ్రిటీలు రచ్చ చేస్తున్నారు. కొందరైతే శివాజీకి ఉన్న ఫాలోయింగ్ ని చూసి శివాజీకి మద్దతు పలుకుతున్నారు. శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పులేదని కితాబు ఇస్తున్నారు. డ్రెస్సింగ్ లో అనసూయను ఫాలో అయ్యే అరియానా గ్లోరీ తాజాగా ఈ వివాదంపైన ఊహించని విధంగా స్పందించారు. ఒళ్లంతా కనిపించేలా డ్రెస్సులు వేసుకొని స్కిన్ షో చేస్తున్న అరియానా గ్లోరీ నటుడు శివాజీకి మద్దతు పలికారు.
శివాజీ ఉద్దేశం మంచిదే
శివాజీ ఉద్దేశం సరైనదే కానీ మాటల ఎంపిక వల్ల వివాదం రేగింది అని ఆమె వెల్లడించారు. చీరలు, మంచి దుస్తులు ధరించండి అంటూ చెబుతూ ఆయన పొరపాటున పాడిన అసభ్యకరమైన పదాలు వైరల్ అయ్యాయని, దానికి ఆయన క్షమాపణ కూడా చెప్పాడు. కాబట్టి ఇష్యూ ఇంతటితో వదిలేస్తే బాగుంటుందని ఆమె అన్నారు. ఆయన ఉద్దేశం మంచిదేనని సేఫ్టీ గా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఆయన చెప్పారు అన్నారు.
మా అమ్మ కూడా అలాగే చెప్తుంది అన్న అరియానా గ్లోరీ
ఎవరి ఉద్దేశం వాళ్లకు ఉంటుందని, మా ఇంట్లో మా అమ్మ కూడా నాకు అలానే చెప్తుంది అంటూ అరియానా గ్లోరీ చెప్పారు. ఎవరైనా తమ ఒపీనియన్ చెప్పొచ్చని అది ఎలా తీసుకోవాలి అనేది తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుందని ఆమె అన్నారు.
ట్రోల్ చేస్తారన్న అరియానా
అయినా ఈ వివాదం పైన నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు అని చెప్పిన అరియానా ఇప్పుడు పద్ధతిగా మాట్లాడి బయటకు వెళ్లిన తర్వాత ఎక్కడో ఎలాగో ఉన్నాను అనుకోండి నన్ను ట్రోల్ చేస్తారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా నటుడు శివాజీ అనసూయ కాంట్రవర్సీ ఎఫెక్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ల కంటెంట్ కు ఒక టాపిక్ గా మారింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications