మహిళలపై హైపర్ ఆది అలాంటి పంచులా? నాకు నచ్చవు అంటూనే ఇంద్రజ..
హైపర్ ఆది (Hyper Aadi) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉన్నాడు. తనదైన రైటింగ్ స్టైల్, పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను నవ్వించడంలో ఆది ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. అయితే అదే సమయంలో అతని కామెడీ శైలిపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బాడీ షేమింగ్, ట్రోలింగ్ కామెడీ, అవతలి వారిని తక్కువ చేసే పంచులపై సోషల్ మీడియాలో తరచూ చర్చ జరుగుతోంది.
Renu Desai: ఒక్క మగాడు రేప్ చేస్తే.. మగవాళ్లందరిని చంపేయాలా? రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ నటి ఇంద్రజ (Indraja) హైపర్ ఆది గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూనే, బుల్లితెరపై జడ్జిగా కూడా సందడి చేస్తున్న ఇంద్రజ... హైపర్ ఆది కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ (Sridevi Drama Company)లో కనిపిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన ఇంద్రజ, ఇటీవల సంక్రాంతి సందర్భంగా జరిగిన ఓ ఈవెంట్‌లో హైపర్ ఆది చేసిన స్కిట్ ఒక్కరోజులోనే వన్ మిలియన్ వ్యూస్ దాటిన విషయాన్ని ప్రస్తావించారు.

అయితే "వ్యూస్ రావడం పెద్ద విషయం కాదు" అంటూ అసలు విషయం చెప్పుకొచ్చారు. ఆ స్కిట్‌కు స్క్రిప్ట్ రాయడం, డైరెక్షన్ చేయడం అన్నీ హైపర్ ఆది గారే చేశారని, అదే సమయంలో ప్రోగ్రామ్‌ను మేనేజ్ చేస్తూ, స్కిట్‌లో పాల్గొంటూ, తోటి ఆర్టిస్టులతో సమన్వయంగా పని చేయడం అంత సులువు కాదని వివరించారు. 'ప్రతి డైలాగ్‌ను ఇతర ఆర్టిస్టులకు దగ్గరుండి నేర్పిస్తూ, తానే వాటిని గుర్తుపెట్టుకుని పర్ఫార్మ్ చేయడం అంటే సాధారణ విషయం కాదు. హైపర్ ఆది టాలెంట్, మెమరీ పవర్ నిజంగా గ్రేట్' అంటూ ఆయన ప్రతిభను ఇంద్రజ ప్రశంసించారు. ఒకేసారి రైటర్, డైరెక్టర్, పర్ఫార్మర్ పాత్రలు పోషిస్తూ షోను నడిపించగలగడం ఆది ప్రత్యేకతగా ఆమె పేర్కొన్నారు.
అయితే, అదే సమయంలో ఆయన కామెడీలో కొన్ని అంశాలపై తన అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా వెల్లడించారు.'ఆయన ఆడవారిపై వేసే పంచులు, డైలాగ్స్‌ను నేను ఎప్పటికీ సమర్థించను. అలాంటి కామెడీ నాకు నచ్చదు. ఆ గొడవలు, తగువులు అలానే ఉంటాయి... అవి కొనసాగుతూనే ఉంటాయి. కానీ టాలెంట్ ఎక్కడ ఉన్నా దాన్ని గుర్తించి మెచ్చుకోవాలి. అందులో నేను ముందు వరుసలో ఉండాలని భావిస్తాను' అంటూ పేర్కొన్నారు.
శంకర వరప్రసాద్ సక్సెస్ జోష్‌లో నయనతార.. వివాదాలకు చెక్ పెట్టి త్రిషతో బోట్ షికారు!
ఇక ఇంద్రజ విషయానికి వస్తే... 'యమలీల' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై, ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆమె, పెళ్లి తర్వాత కొన్నేళ్లు సినిమాలకు దూరమయ్యారు. అనంతరం శతమానం భవతితో రీఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం వెండితెరపై తల్లి పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. బుల్లితెరపై జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ మరోసారి ఫుల్ ఫామ్‌లో కొనసాగుతున్నారు. మొత్తానికి, హైపర్ ఆది కామెడీపై ఇంద్రజ చేసిన వ్యాఖ్యలు ఒకవైపు విమర్శగా, మరోవైపు ఆయన ప్రతిభపై ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ఇంద్రజ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అయితే.. ఆ కామెంట్స్ పై హైపర్ ఆది ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Credit: Filmibeat
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications