ఏనుగులకు ఆధార్ కార్డులు!

అడవి ఏనుగులు గ్రామాలపై పడి పంటలను నాశనం చేస్తున్నప్పుడు, ప్రాణనష్టం కలిగిస్తున్నప్పుడు వాటిని అదుపు చేసే "రియల్ హీరోలు" కుంకీ ఏనుగులు. ఇప్పుడు ఈ గజ సేన సంరక్షణ కోసం చిత్తూరు అటవీ శాఖ అధికారులు ఒక అడుగు ముందుకు వేశారు. పలమనేరు కౌండిన్య ఎలిఫెంట్‌ శాంక్చువరీలో ఉన్న ఆరు కుంకీ ఏనుగులకు తాజాగా డీఎన్‌ఏ (DNA) పరీక్షలు నిర్వహించారు.

మనుషులకు ఆధార్ కార్డు ఉన్నట్టే, ఇకపై ఈ ఏనుగులకు కూడా ఒక ప్రత్యేక గుర్తింపు కార్డును కేటాయించనున్నారు. ఇందుకోసం రెండు రోజుల క్రితమే ఏనుగుల రక్త నమూనాలను సేకరించి, డెహ్రాడూన్‌లోని 'వైల్డ్‌లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌'కు పంపారు. ఈ డీఎన్‌ఏ పరీక్షల ఫలితాలు రాగానే, ప్రతి ఏనుగుకు దాని పూర్తి వివరాలతో కూడిన ఒక ఐడెంటిటీ కార్డును తగిలిస్తారు.

DNA Tests for Kounseeya s Kumki Elephants Forest Department to Issue Aadhaar-Like ID Cards for Jumbos
ఏనుగమ్మ.. ఏనుగు.. ఓటేయడానికి వచ్చావా ???
ఏనుగమ్మ.. ఏనుగు.. ఓటేయడానికి వచ్చావా ???

డీఎన్‌ఏ పరీక్షల వల్ల లాభాలేంటి?

చిత్తూరు డీఎఫ్‌వో సుబ్బరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పరీక్షలు కేవలం గుర్తింపు కోసమే కాదు, అంతకు మించి శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. ఏనుగులకు భవిష్యత్తులో వచ్చే జన్యుపరమైన వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించవచ్చు. వాటి శారీరక దృఢత్వాన్ని, ఆరోగ్యాన్ని శాస్త్రీయంగా అంచనా వేయడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఏనుగుల సంతతిని పెంచేందుకు మరియు అధ్యయనాలకు ఈ జన్యు నిధి (Genetic Pool) కీలకం కానుంది.

Kumki Elephants: కుమ్కీ ఏనుగుల కోసం బెంగళూరుకు పవన్! ఏంటీ వీటి ప్రత్యేకత?
Kumki Elephants: కుమ్కీ ఏనుగుల కోసం బెంగళూరుకు పవన్! ఏంటీ వీటి ప్రత్యేకత?

కర్ణాటక నుంచి వచ్చిన గజ సైన్యం

ప్రస్తుతం పలమనేరు క్యాంపులో జయంత్, రంజన్, అభిమన్యు, కృష్ణ, దేవ, వినయ్‌ అనే ఆరు కుంకీ ఏనుగులు ఉన్నాయి. వీటిని ప్రత్యేకంగా కర్ణాటక నుంచి రప్పించారు. ఇవి సాదాసీదా ఏనుగులు కావు.. అడవి ఏనుగులను దారి మళ్లించడంలో, వాటిని శాంతింపజేయడంలో వీటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే రెండుసార్లు అడవి ఏనుగులు గ్రామాల మీదకు రాకుండా అడ్డుకోవడంలో ఈ గజ సేన విజయం సాధించింది. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు రక్షణగా నిలుస్తూ, శాస్త్రీయంగా తన గుర్తింపును పదిలం చేసుకుంటున్న ఈ కుంకీల సేవలు నిజంగా అభినందనీయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+