హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కీలక అప్డేట్!

హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఉన్న జాతీయ రహదారి విస్తరణపై కీలక అప్డేట్ వచ్చింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 8 వరుసలుగా విస్తరించాలని తెలంగాణ రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్‌హెచ్‌ఏఐని కోరారు. ఈ మేరకు ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ప్రతిపాదించారు.

NHAI ఛైర్మన్‌తో కీలక భేటీ

హైదరాబాద్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హెచ్‌ఐసీసీలో ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌తో మంత్రి కోమటిరెడ్డి సమావేశమై హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ ప్రధాన అంశంగా చర్చించారు. ప్రస్తుతం ఈ రహదారిపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు దీన్ని 'డెత్ రోడ్'గా పిలుస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

Hyderabad Vijayawada NH KEY update minister komatireddy venkat reddy meeting with NHAI chairman

నాగ్‌పుర్ మోడల్‌లో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం

ప్రాణనష్టాన్ని తగ్గించడం కోసం త్వరితగతిన 8 లైన్ల విస్తరణ చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ మధ్య 7.1 కి.మీ. పొడవున నాగ్‌పుర్ మోడల్‌లో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ఇప్పటికే కేంద్రానికి సమర్పించినట్లు తెలిపారు. ఈ పనులు పూర్తి కావడం ద్వారా హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

రీజినల్ రింగ్ రోడ్ పనులు త్వరలో

మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణలో రీజినల్ రింగ్ రోడ్ పనులు భూసేకరణ పూర్తి కాగానే త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు మూడేళ్ల క్రితమే కేంద్రం ఆమోదం ఇచ్చిందని, ప్రస్తుతం భూసేకరణ దశలో ఉందని తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గం అంగీకారం అయిన వెంటనే టెండర్లు పూర్తి చేసి పనులు మొదలుపెడతామని హామీ ఇచ్చారు.

బండి భగీరథ్ పోక్సో కేసు.. సీఎం రేవంత్ సీరియస్, విచారణకు సిట్!
బండి భగీరథ్ పోక్సో కేసు.. సీఎం రేవంత్ సీరియస్, విచారణకు సిట్!

రాష్ట్రంలోని రైలు, రోడ్ ప్రాజెక్ట్ లపై కేంద్రమంత్రి ప్రకటన

2014లో తెలంగాణలో 2400 కి.మీ. జాతీయ రహదారులు ఉండగా, 2026 నాటికి 5000 కి.మీ.లకు పెంచడం గొప్ప విజయమని కిషన్ రెడ్డి అన్నారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అత్యాధునికంగా మార్చడం వంటి అంశాలపై కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణతో పాటు రీజినల్ రింగ్ రోడ్ పనులు త్వరగా ప్రారంభమవడం రాష్ట్ర రవాణా రంగానికి ఊపిరి పోస్తుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+