ప్రజల్లోకి వెళ్లేందుకు జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్న కవిత.. నెలరోజుల ప్రణాళిక!
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మే 15 నుంచి నెల రోజుల పాటు భారీ జెండా పండుగ నిర్వహించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని నుంచి వార్డు స్థాయి వరకు ప్రతిచోటా టీఆర్ఎస్ జెండాలు ఎగురవేయాలని ఆదేశించారు. కవిత విడుదల చేసిన ప్రకటనలో, "తెలంగాణ రక్షణ సేన పార్టీ భావజాలాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేందుకు ప్రతీ కార్యకర్త పని చెయ్యాలన్నారు.
మే 15 నుంచి జెండా పండుగ : కవిత నిర్ణయం
క్షేత్ర స్థాయిలోకి పార్టీ జెండా వెళ్లేందుకు మే 15 నుంచి జెండా పండుగను నిర్వహించాలన్నారు. మే 20 నుంచి జూన్ 20 వరకు నెల రోజుల పాటు రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాలు, గ్రామాలు, వార్డుల వరకు పెద్ద ఎత్తున జెండా పండుగ నిర్వహించాలని సూచించారు. అన్ని వార్డుల్లోనూ టీఆర్ఎస్ జెండాలు ఎగురవేయాలి అని స్పష్టం చేశారు.

పార్టీ విధానాలను, పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించే ప్లాన్
ఈ కార్యక్రమం ద్వారా టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ప్రకటించిన పార్టీ విధానాలను, 'పాంచజన్య సిద్ధాంతాలను' ప్రజలందరికీ వివరించాలని కవిత సూచించారు. రాష్ట్రం ఆవిర్భవించి 12 ఏళ్లు గడిచినా తెలంగాణ ఇప్పటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటోందని ఆమె విచారం వ్యక్తం చేశారు. "నీళ్లు - నిధులు - నియామకాలు అనే తెలంగాణ ఉద్యమ నినాదాలు సాకారం కాలేదు. వలస పాలన నాటి దుష్పరిణామాలు మళ్లీ మన మీద పడుతున్నాయన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉద్యమించాలి
తెలంగాణ తెచ్చుకుంటే మన బతుకులు మారుతాయని నమ్మిన ప్రతి వర్గం ప్రస్తుతం అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. స్వరాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా ఉద్యమించిన మనం ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం మరియు సబ్బండ, వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం మరోసారి ఉద్యమించాల్సిన సమయం వచ్చింది అని కవిత అన్నారు. అందుకే తెలంగాణ రక్షణ సేన జెండాను ప్రతి వాడకు, ప్రతి గడపకు చేర్చి పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చాటాలని ఆమె పిలుపునిచ్చారు.
పార్టీ సభ్యత్వం విస్తరణ, క్యాడర్ శిక్షణ కార్యక్రమాలు
పార్టీ ఆవిర్భావానికి మూడు నెలల ముందు నుంచి పెద్దఎత్తున మనతో చేరిన నాయకులు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలంగాణ జాగృతి నాయకత్వం ఈ జెండా పండుగను విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల రోజుల కార్యక్రమం ద్వారా పార్టీ సభ్యత్వం విస్తరణ, క్యాడర్ శిక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అనుబంధ కార్యక్రమాలు కూడా చేపట్టాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్న ఈ జెండా పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.













Click it and Unblock the Notifications