ఏఐ నైపుణ్యాలుంటే భారీ వేతనాలు ? సంచలన రిపోర్ట్..!

కృత్రిమ మేథ కారణంగా ఉద్యోగాలు పోతున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. సంస్థలు అయితే ఏఐని తీసుకొచ్చి ఏదో విధంగా ఉద్యోగుల్ని తగ్గించుకోవాలని, తద్వారా లాభాలు పెంచుకోవాలని చూస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏఐ వల్ల ఉద్యోగులకు భారీ ప్రయోజనం ఉండబోతోందని బియాండ్ ది బజ్ అనే లేబర్ మార్కెట్ పరిశోధన సంస్థ లైట్‌కాస్ట్ చేసిన తాజా విశ్లేషణ చెబుతోంది.

ఏఐ కారణంగా ఉద్యోగాలు పోగొట్టుకునే వారిలో ప్రథమ స్ధానంలో ఉంటామని ఆందోళన చెందుతున్న కోడర్లు, డేటా శాస్త్రవేత్తలతో పాటు ఇతర ఉద్యోగులకూ, ఇతర రంగాల వారికీ ఊరటనిచ్చేలా ఈ తాజా అధ్యయన ఫలితాలు ఉన్నాయి. ఈ రిపోర్టు ప్రకారం ఏఐ నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులు భవిష్యత్తులో 28 శాతం అధికంగా వేతనాలు పొందే అవకాశం ఉందని అంచనా వేశారు. టెక్ రంగాల్లోనే కాదు ఇతర రంగాల్లో సైతం ఈ పెరుగుదల ఇదే స్ధాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

28 percent salary hikes to employees with AI skills here is latest report

ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్లకు పైగా ఉద్యోగ ప్రకటనలను పరిశీలించి ఈ రిపోర్టు తయారు చేశారు. దీని ప్రకారం కంటెంట్ క్రియేటర్లు, హెచ్ ఆర్, విద్య, ఫైనాన్స్ వంటి నాన్-టెక్నికల్ రంగాల్లో సైతం ఏఐ నైపుణ్యాలు కలిగిన నిపుణులకు డిమాండ్ పెరగబోతోంది. వాస్తవానికి ఏఐ ఆటోమేషన్ కారణంగా పలు రంగాల్లో ఉద్యోగాల లేఆఫ్ లు జరుగుతుండగా.. కృత్రిమ మేథ నైపుణ్యాలు పెంచుకుంటే మాత్రం భారీగా వేతనాలు పొందవచ్చని ఈ రిపోర్టు చెబుతోంది.

28 percent salary hikes to employees with AI skills here is latest report

చాట్ జీపీటీ, కోపైలట్, మిడ్ జర్నీ, డాల్-ఈ వంటి జనరేటివ్ ఏఐ టూల్స్ నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు 2022తో పోలిస్తే ఈ మూడేళ్లలోనే 800 శాతం పెరిగినట్లు ఈ రిపోర్ట్ చెబుతోంది. ఏఐ డిమాండ్ వేగంగా పెరుగుతున్న నాన్-టెక్నికల్ రంగాల్లో కంటెంట్-కమ్యూనికేషన్స్, హెచ్ ఆర్, విద్య, ఫైనాన్స్-రీసెర్చ్ ఉన్నాయి. ఈ రంగాల్లో ఉన్న సంస్థలు టెక్నికల్ డిగ్రీలు లేకపోయినా ఏఐ నైపుణ్యాలు ఉంటే చాలు ఉద్యోగాలు ఇస్తున్నాయి. అలాగే ఏఐ నైపుణ్యాలు అవసరం లేని ఉద్యోగాలతో పోలిస్తే నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో సగటున 15 లక్షలు ఎక్కువగా చెల్లించేందుకు సంస్థలు సిద్దంగా ఉన్నాయట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+