ఈ 6 ఏఐ టూల్స్ తో మీ టైమ్ ఫుల్ గా సేవ్ చేసుకోవచ్చు..
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. కంటెంట్ ను క్రియేట్ చేయడానికి, డెవలప్ చేయడానికి ఏఐ టూల్స్ ను వినియోగిస్తున్నారు. ఈ ఏఐ టూల్స్ ను వినియోగించి కంటెంట్ క్రియేటర్స్ టైమ్ సేవింగ్ చేసుకుంటున్నారు. గంటల కొద్దీ సమాయాన్ని ఈ ఏఐ టూల్స్ సేవ్ చేస్తున్నాయి. దీంతో కంటెంట్ క్రియేటర్స్ కు ఫుల్ టైమ్ సేవ్ అవుతోంది. తక్కువ సమయంలోనే ఎక్కువ కంటెంట్ ను డెలివర్ చేస్తున్నారు. ఈ 6 ఏఐ టూల్స్ ను వినియోగించి పనిని వేగవంతంగా చేయవచ్చు. అదే పనిని ప్రతి రోజూ మరింత ప్రొడక్టివిటీతో చేయవచ్చు.
పోస్టులను షెడ్యూల్ పెట్టడం
భారత్ లోని అనేకమంది కంటెంట్ క్రియేటర్లు తమ పోస్టులను నిర్ణీత సమయానికి షెడ్యూలింగ్ చేస్తున్నారు. ఇన్ స్టా, యూట్యూబ్, ఫేస్ బుక్ పోస్టులకు ఈ విధానాన్ని వినియోగిస్తున్నారు. ఈ విధానం ద్వారా రోజూ కంటెంట్ ను డెలివరీ చేయడంతోపాటు కంటెంట్ క్రియేటర్స్ కు సమయం కూడా వృథా అవుతుంది. ఆటోమేటిక్ షెడ్యూలింగ్ ద్వారా మానవ ప్రయత్నం లేకుండానే కచ్చితమైన సమయానికి పబ్లిషింగ్ అవుతుంది.
మెసేజ్ లకు ఆటోమెటిక్ రిప్లై
చాలామంది మెసేజ్ లకు రిప్లై ఇవ్వడానికి, బేసిక్ కామెంట్స్ ఇవ్వడానికి స్మార్ట్ బోట్స్ ను వినియోగిస్తున్నారు. ఇది కంటెంట్ క్రియేటర్స్ కు రిప్లై ఇచ్చే టైమ్ సేవ్ అవుతుంది. ఈ సమయంలో క్రియేటర్స్ కొత్త కంటెంట్ ను వెతుక్కోవడానికి.. వినియోగించుకోవచ్చు.
క్విక్ ఎడిటింగ్ కోసం
క్విక్ ఎడిటింగ్ కోసం కంటెంట్ టెంప్లేట్స్ ను వినియోగించుకోవచ్చు. క్రియేటర్స్ అప్పటికే రేడీమేడ్ గా ఉన్న థంబ్నెయిల్స్, వీడియో ఇంట్రోస్, సోషల్ పోస్టులను వినియోగించుకుంటున్నారు. దీనివల్ల ఎడిటింగ్ స్పీడ్ గా అవుతుంది. గంటల తరబడి టైమ్ వేస్ట్ జరగదు.
బల్క్ అప్ లోడింగ్, పోస్టు రీసైక్లింగ్
మల్టిపుల్ పోస్టులు లేదా వీడియోలు అప్ లోడింగ్ చేయడం ద్వారా సమయం ఆదా అవుతుంది. అలాగే రీసైక్లింగ్ ఎవర్ గ్రీన్ కంటెంట్ ద్వారా ఫీడ్స్ యాక్టివ్ గా ఉంటాయి. ప్రతిసారి కొత్త మెటీరియల్ అప్ లోడింగ్ జరగదు.

ఆటోమేటిక్ పెర్ఫామెన్స్ ట్రాకింగ్
ఏ కంటెంట్ కు ఎక్కువ వ్యూస్ వచ్చాయి. లైదా ఇంటరాక్షన్ జరిగింది అని ఆటోమేటిక్ ఎనలైటిక్స్ అనే ఏఐ టూల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ డేటా ఆధారంగా బెటర్ పోస్టులను అప్ లోడ్ చేయవచ్చు. మానువల్ గా కాకుండా ఈ టెక్నాలజీ ఆధారంగా ఆడియన్స్ ఎంచుకునే విధానాన్ని తెలుసుకోవచ్చు.
షేర్డ్ డ్యాష్ బోర్డ్స్ తో కొలాబరేట్..
టీమ్ లోని అనేకమంది ఒకేసారి కంటెంట్ క్యాలెండర్స్ పై వర్క్ చేయవచ్చు. షేర్డ్ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకోవచ్చు. ఈ విధానం ద్వారా కంటెంట్ ప్లానింగ్, అప్రూవల్స్ తో పాటు మొత్తం క్రియేటివ్ ప్రాసెస్ స్పీడ్ అవుతుంది.












Click it and Unblock the Notifications