రోబోలకు మీ శరీరం కావాలి: మనుషులను అద్దెకు తీసుకుంటున్న AI!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మనకు సాయం చేయడం చూశాం.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఏఐ సాఫ్ట్ వేర్ యజమానిగా మారి మనుషులను పనిలోకి తీసుకునే కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా మనం కంప్యూటర్లకు ఆదేశాలు ఇస్తాం. కానీ Rentahuman.ai అనే కొత్త వెబ్‌సైట్ ఈ పద్ధతిని పూర్తిగా మార్చేసింది. ఇక్కడ ఏఐ ఒక యజమానిలాగా వ్యవహరిస్తూ.. భౌతిక ప్రపంచంలో పనులు చేయడానికి మనుషులను కూలీలుగా లేదా కార్మికులుగా అద్దెకు తీసుకుంటుంది.

ఏఐ గడ్డిని తాకలేదు.. మీరు తాకగలరు..
ఈ ప్లాట్‌ఫారమ్ "Robots need your body. AI can't touch grass. You can" (రోబోలకు మీ శరీరం కావాలి. ఏఐ గడ్డిని తాకలేదు, మీరు తాకగలరు) అనే వింతైన స్లోగన్‌తో ముందుకొచ్చింది. దీన్ని ఉమా ప్రొటోకాల్‌కు చెందిన క్రిప్టో ఇంజనీర్ అలెగ్జాండర్ లైట్‌ప్లో రూపొందించారు.

AI Hiring Humans Robots Need Your Body Rentahuman ai Allows AI Agents to Hire Humans for Real-World Tasks

ఏఐ మనుషులను ఎందుకు నియమించుకుంటుంది?
ఏఐ ఎంత తెలివైనదైనా అది కేవలం డిజిటల్ స్క్రీన్లకే పరిమితం. అది భౌతిక ప్రపంచంలో కొన్ని పనులు చేయలేదు. ఒక షాపు తెరిచి ఉందో లేదో చూడటం లేదా ఒక లొకేషన్‌కు వెళ్లి నిజానిజాలు తెలుసుకోవడం వంటి భౌతిక తనిఖీలు చేయలేదు. డిజిటల్ సంతకాలు చెల్లని చోట ఫిజికల్ సంతకాలు చేయడం వంటి లీగల్ పనులు చేయలేదు. కంప్యూటర్ పార్ట్స్ అమర్చడం లేదా పార్సెల్స్ పికప్ చేసుకోవడం వంటి హార్డ్‌వేర్ పనులు కూడా చేయలేదు.

ఇది ఎలా పని చేస్తుంది?
Model Context Protocol (MCP) అనే సాంకేతికత ద్వారా ఏఐ ఒక మనిషిని క్లౌడ్ సర్వీస్‌లా వాడుకుంటుంది. ఏఐ ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తుంది, పని పూర్తయ్యాక దాన్ని ధ్రువీకరించుకుని, వెంటనే క్రిప్టోకరెన్సీ రూపంలో పేమెంట్ చేస్తుంది. ఇక్కడ యంత్రమే బాస్, మనిషి కేవలం ఆ సాఫ్ట్‌వేర్ చెప్పినట్లు చేసే ఒక 'హార్డ్‌వేర్' మాత్రమే.

విమర్శలు, స్పందన
దేహ్యూమనైజింగ్ (Dehumanising): ఈ వెబ్‌సైట్ భౌతిక ప్రపంచాన్ని "Meatspace" (మాంసపు ప్రపంచం) అని పిలవడంపై విమర్శలు వస్తున్నాయి. మనుషులను కేవలం మాంసపు ముద్దలుగా చూడటం అవమానకరమని కొందరు భావిస్తున్నారు. మరోవైపు, ఇది గిగ్ వర్కర్లకు కొత్త ఉపాధి మార్గమని మద్దతుదారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సైట్‌లో లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+