మర మనిషిగా మానవుడు.. మానవుడిగా ఏఐ..!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది. జనజీవన స్రవంతిలో ఏఐ కలిసిపోయింది. మనం రోజూ చేసే పనులకు ఏఐ ను వినియోగించుకుంటున్నాం. బర్త్ డే రోజులను.. ఇతర ముఖ్యమైన తేదీలను గుర్తుచేసేందుకు వాయిస్ అసిస్టెంట్ ను వాడుతున్నాం. మెడికల్ రికాడ్స్ కోసం యాప్స్ ను వాడుతున్నాం. చెకప్ కోసం డిజిటల్ టూల్స్ ను వినియోగిస్తున్నాం. ఇలాంటి చిన్న చిన్న పనులు లైఫ్ ను ఈజీగా మారుస్తున్నాయి. ఇదే విషయంపై వైద్యులు పరిశోధనలు జరిపారు. మెషిన్స్ కూడా ఆలోచన మొదలు పెడితే.. మన తరఫున అన్నింటిని అవి గుర్తుంచుకుంటే అనే విషయంపై పరిశోధనలు జరిపారు.
ఏఐ తన మెమోరీని కోడ్స్, అల్గారిథమ్స్ లో స్టోరేజీ చేసుకుంటుంది. ఓ లైబ్రరీలా ఏఐ డేటా ఉంటుంది. సెకన్స్ లో సమాధానం ఇస్తుంది. ఉదాహరణకు ఓ మెడికల్ ఏఐ ప్లాట్ ఫామ్ .. వేల మంది పేషెంట్ల రికార్డులను సెకన్ వ్యవధిలో స్కానింగ్ చేయగలదు. ఒకదానికొకటి కంపేరింగ్ చేయగలదు. ఫాస్ట్ గా, కచ్చితత్వంతో, ఎంతో సామర్థ్యం కలిగిన విధంగా పనిచేస్తుంది.. అని వైద్యుల పరిశోధనలో తేలింది.
కానీ మానవుడి మెమోరీ మాత్రం ఘటనలను గుర్తుపెట్టుకోవడం మాత్రమే కాదు.. ఆ ఎమోషన్స్, అనుభవాలను గుర్తుపెట్టుకుంటుంది. చిన్నప్పటి ఓ ఫేవరేట్ మీల్ గుర్తు చేసుకుంటే.. అప్పుడు మన ప్లేట్ లో ఏముందో మాత్రమే కాదు.. అప్పటి కిచెన్ ఘుమఘుమలు కూడా మనకు గుర్తుంటాయి. ఎమోషనల్ డెప్త్ ఏ మెషిన్ కూడా ప్రదర్శించలేదు.. అని వైద్యులు అభిప్రాయపడ్డారు. కానీ ప్రస్తుత కాలంలో మనం మెమోరీని వినియోగించే విధానాన్ని మార్చుకున్నాం. దీనిని పరిశోధకులు గూగుల్ ఎఫెక్ట్ అని లేదా డిజిటల్ అమ్నేషియా అని అభిప్రాయపడుతున్నారు.

అంటే జనాలు తమ మొబైల్ ఫోన్ లో ఉన్న సమాచారాన్ని మెదడులో నిక్షిప్తం చేసుకునేందుకు సిద్ధంగా లేరు. వాటిని గుర్తుపెట్టుకోవడానికి ఇష్ట పడటం లేదు. దీనివల్ల మన మెదడు రీ కాల్ సమయంలో తక్కువ సామర్థ్యంతో పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అది రాను రాను తీవ్రతరమై ఒక పని మీద ఆసక్తి, కమాండ్ ను తగ్గిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, ఎంపతీ లో ఏఐ మానవుడిని రీ ప్లేస్ చేయలేదని తెలిపారు. భవిష్యత్తులో ఏఐతోపాటు మానవ మేధస్సును కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్లాలని అన్నారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications