అమెజాన్ డెలివరీ సిబ్బందికి ఎసరు- ఆరు లక్షల రోబోలతో రీప్లేస్: క్లారిటీ..!!

అమెజాన్ ఉద్యోగాల తొలగింపు మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2027 నాటికి సుమారు ఆరు లక్షల మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. వారి స్థానంలో హ్యూమనాయిడ్ రోబోలను ప్రవేశపెట్టాలని కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. రోబొటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ద్వారా 2025-2027 మధ్య కాలంలో 12.6 బిలియన్ల డాలర్ల మేర మానవ వనరులను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన ఓ ఇంటర్నల్ డాక్యుమెంట్ ను ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది.

వచ్చే రెండేళ్లలో 1,60,000 వేర్‌ హౌస్ ఉద్యోగాలపై ప్రభావం పడొచ్చని సమాచారం. అమెరికాలో గల అన్ని కార్యాలయాల్లో ఆటోమేషన్‌పై పెట్టుబడులు కొనసాగుతున్నాయని అమెజాన్ ఇప్పటికే ధృవీకరించడం.. ఈ అనుమానాలను మరింత బలోపేతం చేస్తోంది. రోబోటిక్స్, ఆటోమేషన్ తో వేర్‌హౌస్, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లో 75 శాతం ఆటోమేట్ చేయడానికి దీర్ఘకాలిక ప్రణాళికలను అమెజాన్ రూపొందించుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.

Amazon plans 600000 Jobs to Be Replaced by Robots by 2027

2027 నాటికి 6,00,000 డెలివరీ, వేర్ హౌస్ ఉద్యోగాలను హ్యూమనాయిడ్ రోబోలతో భర్తీ చేయడం లేదా మానవ వనరుల అవసరాన్ని తగ్గించడానికి సంస్థ యాజమాన్యం ప్రాధాన్యత ఇస్తోంది. ఇది- అమెరికా కార్పొరేట్ చరిత్రలో ఓ అతిపెద్ద మార్పుగా భావిస్తున్నారు. ఈ అంచనాలు నిజమైతే.. రాబోయే కొన్ని సంవత్సరాల్లో మిలియన్ కంటే ఎక్కువ ఉద్యోగులను కలిగి ఉన్న అమెరికన్ కంపెనీల్లో ఆటోమేషన్, హ్యూమనాయిడ్ రోబోల వినియోగం భారీగా పెరగొచ్చు.

ఒకప్పుడు ఉద్యోగులతో రద్దీగా ఉండే అమెజాన్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు.. రోబోలతో నిండిపోయే అవకాశం ఉంది. ఈ రోబోలు రౌండ్ ద క్లాక్ పనిచేస్తాయి. ఇ-కామర్స్‌ రంగంలో ప్రపంచస్థాయిలో పోటీ తీవ్రమౌతున్నందున ఖర్చులను తగ్గించడానికి, డెలివరీ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడానికి అమెజాన్ ఈ ప్రణాళికలను రూపొందించుకుంటోంది.

మనుషుల స్థానంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యంత్రాలను ప్రవేశపెట్టడం ద్వారా, కంపెనీ ఆర్డర్లను వేగంగా ప్రాసెస్ చేయాలని, అడ్మిన్ లోపాలను తగ్గించాలని, ఉత్పత్తులను మరింత ఖచ్చితత్వంతో డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ప్రధానంగా ప్రోటియస్, సీక్వోయా వంటి అధునాతన రోబోటిక్స్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకుని రావాలని అమెజాన్ నిర్ణయించుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.

ఆయా హ్యూమనాయిడ్ రోబోలన్నీ కూడా వేర్‌హౌస్లలో తమకు తాముగా కార్యకలాపాలను సాగించగలవు. సెన్సార్లు, కెమెరాలు, AI అల్గోరిథమ్‌లతో వాటిని తయారు చేస్తారు. మనుషుల పర్యవేక్షణ లేకుండా ప్యాకేజీలను తరలించడానికి, వాటిని లోడ్ చేయడం, కేటగిరీలుగా విభజించడం.. వంటి పనులన్నింటినీ చేస్తాయి. డెలివరీ వెహికల్స్, డ్రోన్ షిప్పింగ్ కార్యక్రమాలతో సహా AI-ఆధారిత లాజిస్టిక్స్, డెలివరీ కార్యకలాపాలను కూడా అమెజాన్ ఈ రోబోలతోనే భర్తీ చేయనుంది.

అమెజాన్ సంస్థ వివరణ

అమెజాన్ (Amazon) కంపెనీకి సంబంధించిన అంతర్గత పత్రాలు లీకైన నేపథ్యంలో వస్తున్న పలు వార్తలపై ఆ సంస్థ స్పష్టత ఇచ్చింది. ఉద్యోగాల కోతలు, ఆటోమేషన్ (Automation), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి పదాలను ఉపయోగించవద్దనే ఆదేశాలు ఉన్నాయనే వార్తలను అమెజాన్ ఖండించింది. బయటకు లీకైన డాక్యుమెంట్లలోని సమాచారం పూర్తిగా లేదని అందులో పాక్షిక సమాచారం మాత్రమే బయటకు వచ్చిందని అమెజాన్ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. బయటకు లీకైన డాక్యుమెంట్లు ఒక టీమ్‌కు సంబంధించిన ఆలోచన మాత్రమే అని స్పష్టం చేసిన సంస్థ.. అది మొత్తం కంపెనీ యొక్క విధానం కాదని వెల్లడించింది.

ఇక ఉద్యోగాలలో కోత ఉండదని స్పష్టం చేసిన అమెజాన్ సంస్థ..గత పదేళ్లలో అమెరికాలో అన్నిటికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది తామే అని వెల్లడించింది. పండగ సందర్భాల్లో మరో 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.అమెజాన్ కంపెనీలో రోబోట్ల గురించి మాట్లాడేటప్పుడు 'ఆటోమేషన్' లేదా 'AI' పదాలను వాడొద్దని తాము ఎక్కడా చెప్పలేదని సంస్థ వివరించింది. దీనికి బదులుగా, ఆ టెక్నాలజీ ఎంత సురక్షితమో, ఎంత ఉపయోగమో తమ ఉద్యోగులకు బాగా అర్థమయ్యేలా వివరిస్తామని క్లారిటీ ఇచ్చింది.

మొత్తానికి, లీకైన వార్తలను నమ్మవద్దని, అమెజాన్ కొత్తగా ఉద్యోగాలు ఇస్తూనే ఉందని ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+