సైబర్ నేరస్థులపై AI అస్త్రం - ఫుల్ డిమాండ్..!!
ఏఐ-ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్. ఇప్పుడు ప్రపంచాన్ని శాశిస్తోంది. ప్రయివేటు రంగంలోనే కాదు.. ప్రభుత్వాలు సైతం ఏఐకి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏఐకి కనిపిస్తున్న ఆదరణ.. భవిష్యత్ కారణం గా ఇప్పుడు ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ కోర్సుల వైపు యువత మొగ్గు చూపుతోంది. ప్రధాన కాలేజీ లు సైతం ఏఐ కోర్సులను ప్రచారం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఏఐ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వినియోగిస్తున్నాయి. ఇక సైబర్ నేరగాళ్లను అదుపు చేయటంలో ఇప్పుడు ఏఐ కీలకంగా మారుతోంది. బ్యాంకులు.. మొబైల్ సర్వీసు ప్రొవైడర్ల నుంచి సైబర్ మోసాలను కంట్రోల్ చేయటానికి వినియోగిస్తున్న ఏఐ కి ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది.
ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అనేక మార్గాల్లో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అనేక మందిని ఈ సైబర్ నేరగాళ్లు ముంచేస్తున్నారు. దీంతో, వినియోగదారుల కు రక్షణగా సెల్‌ఫోన్ ప్రొవైడర్లు, బ్యాంకులు రంగ ప్రవేశం చేశాయి. సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ (AI) సాయంతో ప్రత్యేక ప్రోగ్రామ్స్ సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో కేవలం 10 రోజుల వ్యవధిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల అనుమానాస్పద కాల్స్ గుర్తించినట్లు ప్రముఖ సంస్థ ఎయిర్‌టెల్ అధికారికంగా వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 9 నెలల్లో ఒక్క తెలంగాణలోనే సైబర్ నేరగాళ్లు దాదాపు రూ.1,500 కోట్లు దోచుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఒక తరహా నేరంపై ప్రజల్లో అవగాహన పెరిగేసరికి నేరగాళ్లు మరో కొత్తతరహా మోసాన్ని తెరపైకి తెస్తున్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నేరాలు జరగకుండా బ్యాంకులు, సెల్‌ఫోన్ ప్రొవైడర్లు రంగంలోకి దిగాయి. మోసపూరిత కాల్స్, మెసేజ్‌లు, లింకులు గుర్తించి నివారించడానికి, ప్రజలను అప్రమత్తం చేయడానికి సెల్‌ఫోన్ ప్రొవైడర్లు నడుం బిగించారు. ఏఐతో సాఫ్ట్‌వేర్ రూపొందించి ఒకే నంబర్ నుంచి దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వరుసగా కాల్స్ వెళ్తుంటే దానిని అనుమానాస్పద నంబర్‌గా గుర్తిస్తున్నారు. వీటిని నిలిపివేయడం, లేదంటే అనుమానాస్పద కాల్, సందేశం అని వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇదే తరహాలో బ్యాంకులు సైతం ఏఐ వినియోగం తో నేరాల సంఖ్య ను నియంత్రిస్తున్నాయి. దీని ద్వారా ఇప్పుడు ఏఐ ద్వారా నేరాలను నియంత్రణ తగ్గుతుందని చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు ఈ రంగంలో ఏఐకి ఫుల్ డిమాండ్ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications