ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులకు ఆన్‌లైన్‌ శిక్షణ, అర్హతలు..!!

ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్. ఇప్పుడు ఏ రంగంలో చూసినా విస్తరిస్తోంది. దిగ్గజ సంస్థల నుంచి ప్రభుత్వాల వరకు ఏఐకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఏఐ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ కోర్సులకు ఆన్‌లైన్‌ లో శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ స్కిల్ అకాడమీ ముందుకు వచ్చింది. దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకు సంబంధించిన అర్హత లు.. శిక్షణా విధానం గురించి సంస్థ వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ స్కిల్ అకాడమీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు లకు ఆన్‌లైన్‌ లో శిక్షణఆన్ లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రోగ్రామ్ ఇంటర్ పాస్, ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులతో పాటుగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ నేషనల్ స్కిల్ అకాడమీ విద్యార్థులకు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ లో తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది. ఈ శిక్షణలో డిప్లమా ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పీజీ డిప్లొమా ఇన్ ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్స్, మాస్టర్ ప్రోగ్రాం ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డిప్లొమా ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్, పీజీ డిప్లొమా ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్, మాస్టర్ ప్రోగ్రాం ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్. ఈ కోర్సులకు ఆన్‌లైన్‌లో శిక్షణ అందించనున్నారు.

artificial-intelligence-courses-online-training-classes-offered-by-national-skill-academy-announces

భవిష్యత్ మొత్తం ఏఐ యుగమే

శిక్షణ తరువాత పరీక్షలను నిర్వహిస్తారు. పాస్ అయిన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆమోదించిన సర్టిఫికేట్‌ను అందించనున్నారు. కోర్సు వ్యవధి 5 నెలల నుండి 10 నెలల వరకు ఉంటుందని వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్‌లో ఇన్‌ డెప్త్ నాల్డెజ్ పొందేందుకు విద్యార్థులతో పాటుగా ఉద్యోగులకు ఇది చక్కటి అవకాశంగా వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటలి జెన్స్ నిపుణుల అవసరం దాదాపు ప్రతి పరిశ్రమలోనూ ఉంది, సాఫ్ట్వేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్థిక సేవలు,ఆరోగ్య సంరక్షణ తో పాటుగా విద్యా వ్యవస్థలోనూ కనిపిస్తోంది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రాబోయే ఐదేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా 40 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేసింది. ఈ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు విదేశాలలో అధిక వేతనాలతో ఉత్తమ ఉపాధి అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు www.nationalskillacademy.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+