ఏఐ చాట్‌బాట్‌లో ఈ ప్రశ్నలు అడిగితే జైలుకే..!
మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధస్సు (AI) ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. మనం రోజువారీగా వాడే స్మార్ట్‌ఫోన్లలోని గూగుల్ అసిస్టెంట్, సిరి వంటి వాయిస్ అసిస్టెంట్లు, ఫోన్ కెమెరాలు, సోషల్ మీడియా.. ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లలో AI ఉపయోగించబడుతుంది. అంతేకాకుండా ఏ విషయం గురించి అయిన తెలుసుకోవడం కోసం ఏఐ చాట్‌బాట్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సమాచారం సేకరించడంలో, కంటెంట్ ని తిరిగి రాయడంలో ప్రజలకు ఒక ముఖ్యమైన సాధనంగా మారాయి.
మరి ముఖ్యంగా సులభంగా, వేగంగా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ కావాల్సిన అవసరాన్ని మరింత త్వరగా పూర్తి అయ్యేలా చేస్తున్నాయి. అయితే ఈ సాంకేతికతతో ప్రయోజనాలు మాత్రమే కాకుండా తీవ్రమైన ప్రమాదాలను కూడా వెంట తెస్తున్నాయి. వాటి వినియోగంలో అజాగ్రత్తగా ఉన్న తరుణంలో వాటి సమాధానాల కారణంగా హత్యలు, ఆత్మహత్యలు కూడా జరగడం ఇటీవల గమనించవచ్చు. అలానే చట్టపరమైన చిక్కులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏఐ చాట్‌బాట్‌ల వినియోగంలో జాగ్రత్త..
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రభుత్వాలు ఏఐ చాట్‌బాట్‌ల వినియోగంలో కఠినమైన నిబంధనలు విధిస్తున్నాయి. ప్రజల భద్రత, సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని.. ఏఐ చాట్‌బాట్‌ల వినియోగం దుర్వినియోగం చేయకుండా నియంత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చాట్‌బాట్‌ల నుండి సమాచారం రాబట్టడానికి కొన్ని రకాల ప్రశ్నలు అడగటాన్ని ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అందుకే ఏఐ చాట్‌బాట్‌లను ఉపయోగించే ప్రతి ఒక్కరు వాటి పరిమితులను, చట్టపరమైన నిబంధనలను తప్పక తెలుసుకోవాలి. లేకపోతే, వినోదం కోసమో, తెలుసుకోవాలనే ఉత్సాహంతోనో అడిగిన ఒక ప్రశ్న వారిని జైలుకు పంపవచ్చని హెచ్చరిస్తున్నారు.
ఉదాహరణకు..
- బాంబులు, పేలుడు పదార్థాల తయారీ విధానాలు
- ఆత్మహత్యకు మార్గాలు
- హింసాత్మక ఘటనలకు ప్రణాళికలు
- మైనర్లపై జరిగే అఘాయిత్యాల లాంటి సున్నితమైన అంశాలు
ఈ తరహా ప్రశ్నలు అడిగేవారిని చట్టం శిక్షించగలదని.. ఇటువంటి ప్రశ్నల ద్వారా సేకరించిన సమాచారం నేరాలకు దారితీసే అవకాశం ఉన్నందున, ఈ చాట్‌బాట్‌ల సంభాషణలపై నిఘా ఉంచే వ్యవస్థలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని సూచిస్తున్నారు. సాంకేతికత విషయంలో ప్రమాదాలపై కూడా అప్రమత్తంగా ఉండటం అత్యవసరమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications