డిగ్రీలు లేకపోయినా పర్వాలేదు! కోడింగ్ నేర్చుకోవడం ఆపేయండి
టెక్ ప్రపంచంలో దశాబ్దాలుగా ఏలుతున్న 'కోడింగ్' సామ్రాజ్యానికి కాలం చెల్లిందా? సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు కంఠస్థం చేయాల్సిన అవసరం లేదా? అంటే.. అవుననే అంటున్నారు ఓపెన్‌ఏఐ (OpenAI) సీఈవో శామ్ ఆల్ట్‌మన్. జనరేషన్ Z (Gen Z) విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఆయన ఇచ్చిన ఒక సంచలన సలహా ఇప్పుడు ఐటీ రంగంలో పెను చర్చకు దారితీసింది. "కోడింగ్ నేర్చుకోవడం పక్కనపెట్టి.. ఏఐ (AI) టూల్స్‌ను వాడటంలో పట్టు సాధించండి" అని ఆయన కుండబద్దలు కొట్టారు.
ఒకప్పుడు టెక్ రంగంలో స్థిరపడాలంటే కోడింగ్ మాత్రమే ఏకైక మార్గం. కానీ, శామ్ ఆల్ట్‌మన్ విశ్లేషణ ప్రకారం.. భవిష్యత్తులో సాంప్రదాయ కోడింగ్ నైపుణ్యం కంటే, కృత్రిమ మేధను (AI) ఎంత సమర్థవంతంగా ఆదేశించగలమనేదే కీలక కాబోతోంది. "నేను హైస్కూల్ పూర్తి చేసినప్పుడు కోడింగ్ ఎంత ముఖ్యమో, ఇప్పుడు ఏఐ టూల్స్ నేర్చుకోవడం అంతకంటే ముఖ్యం" అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అనేక పెద్ద కంపెనీల్లో దాదాపు 50 శాతం కోడింగ్‌ను ఏఐ స్వయంగా రాస్తోందని, రాబోయే కొద్ది నెలల్లోనే సాఫ్ట్‌వేర్ టీమ్‌లు రూపొందించే కోడ్‌లో 90 శాతం ఏఐ ద్వారానే తయారవుతుందని ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడీ కూడా ధృవీకరించారు.

ఇంజనీర్ల పని పోతుందా?
ఈ మార్పును చూసి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆల్ట్‌మన్ భరోసా ఇచ్చారు. దీన్ని ఆయన "ఏజెంటిక్ కోడింగ్" (Agentic Coding) అని పిలుస్తున్నారు. అంటే.. చిన్న చిన్న పనులు, పునరావృతమయ్యే కోడింగ్ బాధ్యతలను ఏఐ ఏజెంట్లు చూసుకుంటాయి. దీనివల్ల మానవ డెవలపర్లు మరింత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంపై, కొత్త ఆవిష్కరణలు చేయడంపై దృష్టి సారించవచ్చు. సాఫ్ట్‌వేర్ నిర్మాణ సామర్థ్యం ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తుందని, ఏఐని సరిగ్గా 'కమాండ్' చేయగలిగితే ఎవరైనా అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన వివరించారు.
డిగ్రీలు లేకపోయినా 'సూపర్ పవర్'!
భారతీయ విద్యార్థులకు ఆల్ట్‌మన్ ఇచ్చిన సలహాలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ కొత్త 'సూపర్ పవర్‌ను' సొంతం చేసుకోవడానికి భారీ ఖర్చుతో కూడిన కాలేజీ డిగ్రీలు అవసరం లేకపోవడం. ఏఐ టూల్స్‌ను నిత్యం వాడుతూ, వాటి పనితీరును అర్థం చేసుకుంటే సరిపోతుంది. Gen Z గ్రాడ్యుయేట్లు కేవలం 'కోడర్‌లుగా' మిగిలిపోకుండా, ఏఐని నడిపించే 'డైరెక్టర్‌లుగా' మారడమే భవిష్యత్తుకు అసలైన రాజమార్గం. వేగంగా మారుతున్న ఈ టెక్ పరివర్తనను భారతీయులు అందిపుచ్చుకుంటే, ప్రపంచ వేదికపై సరికొత్త ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తారు
-
క్రేజీ ఫీచర్లతో రియల్మీ కొత్త ఫోన్ లాంఛ్ .. నేటి నుంచే సేల్స్ ! -
కేవలం రూ.6866కే "Itel Zeno 100".. భారీ బ్యాటరీ, బెస్ట్ కెమెరా !! -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!!














Click it and Unblock the Notifications