సొంత AI తోనే 'బికినీ' స్టెప్పులు.. ఎలాన్ మస్క్ రియాక్షన్‌కు నెటిజన్లు ఫిదా!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన వింత ధోరణితో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. అయితే ఈ సారి మస్క్ తన సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మోడల్ గ్రోక్(Grok) సృష్టించిన ఫోటోల వల్ల చర్చనీయాంశమయ్యారు. గ్రోక్ ఏఐ మోడల్ ఎలాన్ మస్క్‌కు బికినీలు తొడిగి ఫోటోలను సృష్టించగా.. అవి ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ఎక్స్ వేదికగా వైరల్ అవుతున్నాయి.
బికినీ ఫోటోలపై మస్క్ మజా
గ్రోక్ ఏఐ రూపొందించిన ఫోటోల్లో మస్క్ నీలి రంగు బికినీ ధరించి కండలు తిరిగిన శరీరంతో కనిపిస్తున్నారు. ఈ ఫోటోలను చూసి కోప్పడాల్సింది పోయి మస్క్ వాటిపై సరదాగా స్పందించారు. ఓ ఫోటో కింద 'పర్ఫెక్ట్(Perfect)' అని కామెంట్ చేయగా.. మరో పోస్ట్‌పై పగలబడి నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశారు. కేవలం మస్క్ మాత్రమే కాదు.. బిల్ గేట్స్ కూడా గ్రోక్ సృష్టించిన ఈ వింత ఫోటోలకు బలయ్యారు. బ్లాక్ కలర్ బికినీలో ఉన్న బిల్ గేట్స్ ఫోటోపై కూడా ఎలాన్ మస్క్ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.

ఆందోళన కలిగిస్తున్న 'స్పైసీ మోడ్'
సరదా పక్కన పెడితే గ్రోక్ AI ఈ చర్య సాంకేతిక నిపుణులలో ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా గూగుల్ 'జెమిని' (Gemini) లేదా OpenAIకి చెందిన 'ChatGPT' వంటి AI మోడల్స్ ఇలాంటి అశ్లీల లేదా వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించే ఫోటోలను సృష్టించవు. ఎవరైనా అలాంటి ప్రయత్నం చేస్తే అవి నిరాకరిస్తాయి. కానీ గ్రోక్ AI మాత్రం తన "Spicy Mode" సహాయంతో ఎవరి దుస్తులనైనా మార్చేయగలనని గర్వంగా చెబుతోంది. ఒక సింపుల్ కమాండ్ (Prompt) ఇస్తే చాలు, ఏ వ్యక్తినైనా అరకొర దుస్తుల్లో చూపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రైవసీకి పెను ముప్పు!
మస్క్ దీనిని ఒక జోక్‌లా తీసుకున్నప్పటికీ, సామాన్య ప్రజల విషయంలో ఇది చాలా ప్రమాదకరమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ టెక్నాలజీని ఉపయోగించి ఎవరి ఫోటోలనైనా మార్ఫింగ్ చేసే అవకాశం ఉంది. ఏఐ నియంత్రణలో ఉండాలని ప్రపంచవ్యాప్తంగా వాదనలు వినిపిస్తున్న తరుణంలో, మస్క్ AI చేస్తున్న ఈ పనులు మరింత వివాదాస్పదమవుతున్నాయి.












Click it and Unblock the Notifications