నాలుగో గ్రోక్ కృష్ణుడు- అనకాపల్లి నుంచి అంతరిక్షం దాకా ఏదైనా అడగొచ్చు

Grok 4: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెగ్మెంట్ లో మరో సంచలనానికి అడుగు ముందుకు పడింది. అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన xAI సరికొత్త మోడల్ గ్రోక్ 4 (Grok 4) ను ఆవిష్కరించింది. ఈ లాంచ్ ఈవెంట్ ను ఎక్స్ .. ప్రత్యక్ష ప్రసారం చేసింది. కొద్దిసేపటి కిందటే ఈ లేటెస్ట్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని బిగ్ బ్యాంగ్ ఇంటెలిజెన్స్ యుగంగా అభివర్ణించారు ఎలాన్ మస్క్.

ప్రస్తుతం ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోన్న విషయం తెలిసిందే. దేనికైనా ఇట్టే సమాధానం ఇవ్వగల సామర్థ్యం వీటికి ఉంది. గ్రోక్, ఛాట్ జీపీటీ-3, Gemini AI 2.5 ప్రో, Copilot.. వంటి ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫామ్స్ ప్రస్తుతం అందుబాటులో ఉంటోన్నాయి.

Elon Musk s AI chatbot Grok 4 launched

దీనికి తోడుగా కొత్తగా గ్రోక్ 4ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఎక్స్ ఏఐ. ఇప్పుడున్న కాంపిటీటివ్ ప్లాట్ ఫామ్స్ కంటే కూడా ఇది ఎంతో మెరుగ్గా, మెరుపు వేగంతో పని చేస్తుందని ఎక్స్ ఏఐ తెలిపింది. యూజర్లు అడిగిన ఏ ప్రశ్నకు అయినా దాదాపుగా వంద శాతం ఖచ్చితత్వంతో కూడుకున్న సమాధానాలను ఇవ్వగలుగుతుందని, దీనికి అవసరమైన సోర్స్ కూడా అందిస్తుందని పేర్కొంది.

ప్రతి సబ్జెక్ట్‌లో గ్రోక్ 4.. పీహెచ్డీ చేసిందని ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ఈ విషయంంలో ఎటువంటి మినహాయింపులు ఉండబోవని, ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ కు తెలియని విషయం అంటూ ఏదీ లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇంతకుముందు విడుదల చేసిన వెర్షన్ల కంటే వేగంగా పని చేస్తుందని వివరించారు.

2023లో xAIని స్థాపించారు ఎలాన్ మస్క్. ఎక్స్ కు అనుబంధంగా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను నిర్వహించే అతిపెద్ద డిజిటల్ ప్లాట్ ఫామ్ ఇది. దీని ఆధారంగానే తొలుత గ్రోక్ మోడల్ ను విడుదల చేశారు. ఇప్పుడు Grok 4 మోడల్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కొత్త వెర్షన్ OpenAI డెవలప్ చేస్తోన్న GPT-5 Anthropic, Claude 4 Opusలతో పోటీ పడనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+