గూగుల్ క్రోమ్‌కు షాక్: ఇండియాలోకి కొత్త బ్రౌజర్.. ప్రత్యేకతలు ఇవే!

Perplexity Comet: గూగుల్ క్రోమ్‌ వెబ్ బ్రౌజర్‌కు ఇప్పుడు భారత్‌లో గట్టి పోటీ ఎదురుకానుంది. భారతీయ యూజర్ల కోసం 'Perplexity Comet' బ్రౌజర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పర్‌ప్లెక్సిటీ(Perplexity) సీఈవో అరవింద్ శ్రీనివాస్ ప్రకటించారు. గత కొన్ని నెలలుగా 'కామెట్' బ్రౌజర్ బాగా ప్రాచుర్యం పొందింది.

కామెట్ బ్రౌజర్ ప్రత్యేకతలు
ఏజెంటిక్ ఏఐ(Agentic AI): ఈ కామెట్ బ్రౌజర్లోని ప్రధాన ఫీచర్ ఇదే. ఇందులో ఉండే ఏఐ అసిస్టెంట్, మీరు ఇచ్చే ఆదేశాల ఆధారంగా పనులను స్వయంగా పూర్తి చేస్తుంది. ఉదాహరణకు మీరు టికెట్ బుక్ చేయమని చెబితే.. అది స్వయంగా వెబ్ సైట్‌తో ఇంటరాక్ట్ అయ్యి టికెట్ బుకింగ్ ప్రక్రియను పూర్తి చేస్తుంది.

Google Chrome Gets a New Rival in India Perplexity Comet Browser Launch and Features

ట్యాబ్‌లను నియంత్రించడం: ఏజెంటిక్ వెబ్ బ్రౌజర్ల ప్రత్యేకత ఏమిటంటే.. అవి మీ కోసం మీ ట్యాబ్‌లను నియంత్రించి వాటిలో పని చేయగలవు. మీరు ఆదేశమిస్తే చాలు.. అది వెబ్‌సైట్లతో స్వయంగా సంభాషించగలదు.

ఈ బ్రౌజర్‌ను ఎవరు వినియోగించవచ్చు?
ప్రస్తుతానికి ఇది ఇన్వైట్-బేస్ట్ బ్రౌజర్.. అంటే అందరికీ అందుబాటులో లేదు. పర్‌ప్లెక్సిటీ సీఈవో అరవింద్ శ్రీనివాస్ తన లింక్డ్‌ఇన్ పోస్టులో ఇండియాలోని 'పర్‌ప్లెక్సిటీ ప్రో' సబ్‌స్క్రైబర్ల అందరికీ ఈ బ్రౌజర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. అంటే పర్‌ప్లెక్సిటీ ఉచిత యూజర్లకు కామెట్ బ్రౌజర్ లభించదు. ఈ బ్రౌజర్ ను ఇప్పుడు విండోస్, మ్యాక్ కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌లలో ఉపయోగించవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు ఇంకా కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం సైన్ అప్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. అందుబాటులోకి వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

విమర్శలు.. భవిష్యత్ ప్రణాళికలు
అమెరికాలో మొదటగా విడుదలైనప్పుడు ఈ బ్రౌజర్‌కు మంచి స్పందన లభించింది. చాలామంది దీనిని డిఫాల్ట్ బ్రౌజర్‌గా కూడా చేసుకున్నారు. కానీ, కొన్ని రోజుల తర్వాత దీనిపై ఫిర్యాదులు మొదలయ్యాయి. ఇది క్రోమ్ మాదిరిగానే ఎక్కువ శక్తిని వినియోగిస్తుందని, కంప్యూటర్ సీపీయూని ఎక్కువగా ఉపయోగిస్తుందని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. పర్‌ప్లెక్సిటీ కామెట్ అసిస్టెంట్ మీ బ్రౌజర్, ట్యాబ్‌లను పూర్తిగా నియంత్రించగలదు కాబట్టి, ప్రైవసీకి సంబంధించి పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భవిష్యత్తులో ఇది కంప్యూటర్ నేటివ్ సెట్టింగ్స్‌తో కూడా పని చేసే ప్రణాళికలు ఉన్నట్లు సమాచారం.

ఎలా ఉపయోగించాలి?
మీకు 'పర్‌ప్లెక్సిటీ ప్రో' సబ్‌స్క్రిప్షన్ ఉంటే.. మీరు కామెట్ బ్రౌజర్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లాగిన్ అయిన తర్వాత దానిని ఉపయోగించడం ప్రారంభించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+