గూగుల్ ద్వారా ఇన్‌స్టంట్ షాపింగ్- ఒక్క క్లిక్ తో అన్నీ ఇంటి వద్దకే

టాప్ సెర్చింజిన్ గూగుల్ తన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ జెమిని ఏఐ (Gemini AI) ని మరింత విస్తరించింది. ఇందులో కొత్తగా షాపింగ్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. దీనికోసం వాల్‌మార్ట్, షాపిఫై, వేఫెయిర్ వంటి ప్రముఖ రిటైలర్లతో వ్యాపార భాగస్వామ్యం కుదుర్చుకుంది. జెమిని ఏఐని వర్చువల్ స్టోర్‌గా మార్చివేసింది. ఇకపై ఇది- షాపింగ్ అసిస్టెంట్‌గా కూడా పని చేస్తుంది. యూజర్ల ముంగిట్లోకి డిజిటల్ షాపింగ్ టూల్ ను అందుబాటులోకి వచ్చింది.

జెమిని ఏఐలో కొత్తగా ఇన్‌స్టంట్ చెక్‌ అవుట్ ఫంక్షన్ టూల్ ప్రవేశపెట్టింది గూగుల్. దీని ద్వారా వినియోగదారులు జెమిని చాట్ బాట్ నుంచే షాపింగ్ చేయవచ్చు. తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఎటువంటి ఉత్పత్తులను అయినా కొనుగోలు చేయడానికి వీలు కల్పించిందీ టూల్. ఈ విషయాన్ని గూగుల్, వాల్‌మార్ట్ సంయుక్తంగా ప్రకటించాయి. దీనికోసం ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపాయి.

Google s Gemini AI Becomes a Virtual Merchant Shop with Walmart Shopify Wayfair and Checkout

అదే సమయంలో డిజిటల్ పేమెంట్స్ కోసం వివిధ సర్వీస్ ప్రొవైడర్లతోనూ సంప్రదింపులు జరిపారు. వాటి ద్వారా డిజిటల్ రూపంలో చెల్లింపులు సులఁభఁంగా చెల్లింపులు చేయవచ్చు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా జెమిని ఏఐ స్పందిస్తుంది. ఉదాహరణకు.. చలికాలంలో స్కీయింగ్ ట్రిప్ వస్తువుల గురించి అడిగితే- జెమిని ఏఐతో భాగస్వామ్యాన్ని కుదర్చుకున్న రిటైలర్ల జాబితా నుండి వాటికి సంబంధించిన ప్రొడక్ట్ ను సూచిస్తుంది. ఇందులో మనకు ఇష్టమైన వాటిని కొనుగోలు చేయవచ్చు.

దీనికి అవసరమైన బిల్లింగ్ ను సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా డిజిటల్ రూపంలో చెల్లించవచ్చు. ఈ రకంగా ఎటువంటి వస్తువులు, ఉత్పత్తులనైనా గానీ యూజర్లు కొనుగోలు చేయడానికి వీలు కల్పించింది గూగుల్. జెమిని ఏఐకి తమ అకౌంట్స్ ను లింక్ చేయడం వల్ల వాల్‌మార్ట్ వినియోగదారులు కూడా తమకు కావాల్సిన వస్తువులను ఎంపిక చేసుకునే ఆప్షన్ లభిస్తుంది. వారి గత కొనుగోళ్ల ఆధారంగా సిఫార్సులు లభిస్తాయి.

చాట్‌బాట్ ద్వారా ఎంచుకున్న ఉత్పత్తులు వారి వాల్‌మార్ట్ లేదా సామ్స్ క్లబ్ షాపింగ్ కార్ట్‌లలోకి నేరుగా తీసుకెళ్తాయి. దీనివల్ల అప్పటికప్పుడు వాటిని కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వీలున్నప్పుడు తీసుకోవచ్చు. గత ఏడాది అక్టోబర్‌లో ఓపెన్ ఏఐ, వాల్‌మార్ట్ కూడా ఇలాంటి ఒప్పందాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌ జీపీటీ ద్వారా వాల్‌మార్ట్ వెబ్‌సైట్ నుండి ఫ్రెష్ ఫుడ్ మినహా అన్నింటినీ ఇన్‌స్టంట్ చెక్‌అవుట్ ద్వారా షాపింగ్ చేయవచ్చని అప్పట్లో ఓపెన్ ఏఐ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+