Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పండగ సీజన్ వేళ.. టీచర్లకు గుడ్ న్యూస్!!

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవ్యాప్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనిపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది.. అది కూడా ఫ్రీగా. ఈ మేరకు కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది.

నిజానికి- తొలుత దీన్ని విద్యార్థులకు మాత్రమే పరిమితం చేసింది. టీచర్లకు కూడా ఇందులో నిష్ణాతులను చేయాలని ఉద్దేశంతో వారికి కూడా ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ కోర్సులన్నింటినీ కూడా ఐఐటీ మద్రాస్ డిజైన్ చేసింది. దేశవ్యాప్తంగా ఉచిత AI కోర్సులను అందించే 'AI ఫర్ ఆల్ 2.0' కార్యక్రమాన్ని ప్రారంభించింది. కిండర్‌గార్టెన్ నుండి 12వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు ఈ కోర్సులలో చేరవచ్చు.

IIT Madras Launches Free AI Courses for School Teachers Enhance Your Skills Today

ఐఐటీ మద్రాస్- ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ సహకారంతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన స్వయం ప్లస్ (SWAYAM Plus) ప్లాట్‌ఫామ్‌పై ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఇప్పటివరకు 'AI ఇన్ ఫిజిక్స్', 'AI ఇన్ కెమిస్ట్రీ', 'AI ఇన్ అకౌంటింగ్', 'క్రికెట్ అనలిటిక్స్ విత్ AI', 'AI/ML విత్ పైథాన్' వంటి ఐదు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తాజాగా K-12 అధ్యాపకులను దృష్టిలో ఉంచుకొని మరో కోర్సు 'AI ఫర్ ఎడ్యుకేటర్స్'ను చేర్చారు.

ఆసక్తి గల ఉపాధ్యాయులు అక్టోబర్ 10వ తేదీ వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. స్వయం ప్లస్ ప్లాట్ ఫామ్ ప్రస్తుతం 15 రంగాల్లో 430 కంటే ఎక్కువ కోర్సులను అందిస్తోంది, 3.7 లక్షలకు పైగా ఇందులో చేరారు. అనేక కోర్సులు క్రెడిట్-అలైన్డ్‌ గా ఉంటోన్నాయి. ఐఐటీ మద్రాస్ అధ్యాపకులు వీటిని పీర్-రివ్యూ చేశారు.

1. AI/ML: పైథాన్ ఉపయోగించడం ద్వారా ఈ కోర్సుకు సంబంధించి విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి ప్లాట్ ఫామ్ లపై బేసిక్ అంశాలపై శిక్షణ పొందవచ్చు. మేథమేటిక్స్, లీనియర్ ఆల్ జీబ్రా, ఆప్టిమైజేషన్, డేటా విజువలైజేషన్‌.. ప్రధానంగా ఇది రూపుదిద్దుకుంది. డేటా సైన్స్‌లో విస్తృతంగా ఉపయోగించే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను కూడా ఇది కవర్ చేస్తుంది. మొత్తం 36 గంటల ఈ కోర్సు.. ముగింపు దశలో సర్టిఫికేషన్ అసెస్ మెంట్ టెస్ట్ కూడా ఉంటుంది.

2. AI తో క్రికెట్ అనలిటిక్స్: ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్‌లు అందిస్తున్న కోర్సు ఇది. క్రికెట్‌ను ప్రధానంగా తీసుకొని పైథాన్ ఉపయోగించి స్పోర్ట్స్ అనలిటిక్స్ లో బేసిక్స్ ను నేర్చుకోవచ్చు. 25 గంటల ఈ ప్రోగ్రామ్ మల్టీ ఆప్షనల్ ఎగ్జామ్ తో ముగుస్తుంది.

3. ఫిజిక్స్‌లో AI: మెషీన్ లెర్నింగ్, న్యూరల్ నెట్‌వర్క్‌, రియల్ టైమ్ వరల్డ్ ఫిజిక్స్ వంటి అంశాల్లో తలెత్తే సమస్యలను ఎలా పరిష్కరించవచ్చనేది ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు. ఇందులో ఇంటరాక్టివ్ సెషన్స్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, హ్యాండ్స్-ఆన్ ల్యాబ్ వర్క్స్ వంటివి ఉంటాయి. ఈ కోర్స్ మొత్తం వ్యవధి 45 గంటలు. 4.

అకౌంటింగ్‌లో AI: కామర్స్, మేనేజ్‌మెంట్ విద్యార్థుల కోసం రూపొందించిన ప్రోగ్రామ్ ఇది. అకౌంటింగ్ లో AI ఎలా వర్తిస్తుందనేది దీని ద్వారా నేర్చుకోవచ్చు. 45 గంటల ఈ కోర్సు సర్టిఫికేషన్ అసెస్ మెంట్ కూడా పొందవచ్చు.

5. కెమిస్ట్రీలో AI: రియల్ టైమ్ వరల్డ్ కెమిస్ట్రీ డేటాసెట్‌ను ఉపయోగించడం ద్వారా AI, పైథాన్ ఎలా మాలిక్యులర్ ప్రాపర్టీస్, మోడల్ రియాక్షన్స్, డిజైన్ డ్రగ్స్ వంటివి నేర్చుకోవచ్చు. ఐఐటీ మద్రాస్ ఈ కోర్సును అందిస్తోంది. దీని కాల వ్యవధి 45 గంటలు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+