ఏఐ ద్వారా 23 లక్షల ఉద్యోగాలు - ఈ స్కిల్స్ ఉంటే భారీ వేతనాలు..!!
ప్రపంచాన్ని ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (AI) సునామీలా చుట్టేస్తోంది. ఏ రంగంలో చూసిన ఏఐ విప్లవం కనిపిస్తోంది. ప్రభుత్వాలు సైతం ఏఐ వినియోగం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ విస్తరణ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రఖ్యాత విద్యా సంస్థలు ఏఐ ఆధారిత కోర్సులను పెంచుతున్నాయి. డిమాండ్ పెరుగుతోంది. అయితే, ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్నారనే చర్చ సాగుతోంది. కాగా, తాజా అధ్యయనం రానున్న రెండేళ్ల కాలంలో 2.3 మిలియన్ ఏఐ ఉద్యోగాలు రానున్నట్లు వెల్లడించింది. అందునా భారతీయ యువతకే ప్రాధాన్యత ఉండనుంది.
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఏఐ సాంకేతికతకు ప్రాధాన్యత పెరుగుతోంది. దీని ద్వారా పలు టెక్ సంస్థల్లో ఉద్యోగాలు కోల్పోతున్న వార్తలు వింటున్నాం. ఇదే సమయంలో ఏఐ రంగంలో భారీ ఎత్తున ఉద్యోగాల కల్పన జరగనుంది. తాజాగా ఒక ప్రముఖ సంస్థ నివేదికలో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రానున్న రెండేళ్ల కాలంలో 2027 నాటికి 2.3 మిలియన్ ఏఐ ఆధారిత ఉద్యోగాలు రానున్నట్లు వెల్లడించింది. AI నిపుణులకు డిమాండ్ పెరగనున్నట్లు స్పష్టం చేసింది. ప్రధానంగా మార్కెటింగ్, డేటా వర్క్, ఆపరేషన్స్ కు ప్రాధాన్యత ఉంటుందని వివరించింది. ఇక.. ఈ సంస్థ అంచనా ప్రకారం ఏఐ టాలెంట్ పూర్ ఈ ఏడాది లో 9.40 లక్షలకు పెరిగి.. వచ్చే ఏడాది కి అది 1.08 మిలియన్లకు చేరుకుంటుందని పేర్కొంది.

ఏఐ రంగంలో ప్రొషెనల్ నైపుణ్యాన్ని పెంచుకోవటం ద్వారా ఏఐలో మంచి అకవకాశాలను అంది పుచ్చుకోవచ్చని వెల్లడించింది. అయితే, యూకే వంటి దేశాల్లో ఏఐ నిపుణుల కొరత ఉందని నివేదికలో పేర్కొంది. జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఏఐ రంగాల్లో నిపుణుల సమస్య ఉన్నట్లు విశ్లేషించింది. దీని ద్వారా యూఎస్, యూకే వంటి దేశాల్లో భారతీయ నిపుణులకు అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పుకొచ్చింది. ఇప్పటికే సేవా రంగంలో 44 శాతం ఏఐ ఆధారితంగానే సాగుతున్నాయని పేర్కొంది. గ్లోబల్ ఏఐ టాలెంట్ కేంద్రంగా భారత్ నిలబడటానికి ఇదే సరైన సమయంగా నివేదిక అభిప్రాయ పడింది. దీంతో, ప్రస్తుతం ఏఐ కి పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా కోర్సులు చేయటం ద్వారా మంచి ఉద్యోగాలు ఖాయమని నివేదిక పేర్కొంది.












Click it and Unblock the Notifications