'ఏఐతో జాగ్రత్త.. వినాశకాలే విపరీత బుద్ధి'.. అవతార్ డైరెక్టర్ సంచలనం
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) యుగం నడుస్తోంది. ఏఐ ప్రతి రంగంలో విస్తరిస్తోంది. మానవుడు చేయలేని, పరిష్కరించలేని అనేక సమస్యలను ఏఐ క్షణాల్లో చేసి చూపిస్తోంది. దీంతో ఇటీవలి కాలంలో ఈ సాంకేతికత వినియోగం క్రమంగా విస్తరిస్తూ వస్తోంది. అటు యువత, ఉద్యోగులు ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకుని ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పొందుతున్నారు. అయితే ఏఏఐతో మానవుడి జీవనవిధానం సులభతరం అయిందని చెప్పేవాళ్లు ఓవైపు ఉంటే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ లాంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు మాత్రం ఏఐతో జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. తాజాగా టైటానిక్, అవతార్ లాంటి సినిమాలు తీసిన హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
హాలీవుడ్ లో దిగ్గజ డైరెక్టర్స్ లో జేమ్స్ కామెరాన్ ఒకరు. ఆయన తీసిన టెర్మినేటర్ సిరీస్, టైటానిక్, అవతార్ సిరీస్ లు ఇప్పటికీ ఇండస్ట్రీ హిట్ గా ఉన్నాయి. అయితే తన సినిమాల్లో ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీని వినియోగించుకోవడంలో ఆయనకు సాటి లేరు. సాంకేతికతపై జేమ్స్ కామెరాన్ కు అంత పట్టు ఉంది. అయితే తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) పై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో టెర్మినేటర్ లాంటి ప్రపంచ వినాశనం జరగొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ టెక్నాలజీతో జాగ్రత్త అని హెచ్చరించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆయుధ వ్యవస్థలతో కలిసి పనిచేసినప్పుడు ప్రపంచానికి తీవ్రమైన ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని జేమ్స్ కామెరాన్ ఆందోళన వ్యక్తం చేశారు. తాను రాసిన 'ఘోస్ట్స్ ఆఫ్ హిరోషిమా' అనే పుస్తకాన్ని ప్రమోట్ చేస్తున్న క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మాట్లాడుతూ.. ఏఐ ను సైనిక వ్యవస్థలు, అణు రక్షణతో కలపడం వల్ల వినాశకరమైన పరిణామాలు సంభవించే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. టెర్మినేటర్ తరహా ప్రపంచం వినాశనం చెందే ముప్పు ఇంకా ఉందని నేను అనుకుంటున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైనవిగా వాతావరణ క్షీణత, అణు ఆయుధాలు, ఏఐ వినియోగం ఉన్నాయన్నారు. ఈ మూడు ఒకేసారి గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయని.. ఈ మేరకు ఏఐ ఒక ప్రమాదకరమైన జూదంగా జేమ్స్ కామెరాన్ అభివర్ణించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications