మొదలైన GAMA సందడి..ఆ హీరోయిన్స్ స్పెషల్ ఎట్రాక్షన్
దుబాయ్, షార్జా ఎక్స్‌పో సెంటర్ వేదికగా ఆగస్టు 30న జరగనున్న ప్రతిష్టాత్మక Keinfra Properties GAMA (Gulf Academy Movie Awards) 2025 - 5వ ఎడిషన్ వేడుకలకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు సంబంధించిన థీమ్ సాంగ్‌ను శనివారం దుబాయ్‌లో లాంఛ్ చేశారు.
చంద్రబోస్ సాహిత్యం, రఘు కుంచె స్వరకల్పన:
ఈ థీమ్ సాంగ్‌కు ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ అద్భుతమైన, ఆకట్టుకునే సాహిత్యం అందించగా, రఘు కుంచె స్వరకల్పన చేసి, స్వయంగా ఆలపించి అందరినీ అలరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి యూఏఈలోని పలువురు తెలుగు ప్రముఖులు హాజరై, సంగీత ప్రదర్శనను ప్రత్యక్షంగా వీక్షించారు.

భారీ ఏర్పాట్లు, సినీ ప్రముఖుల సందడి:
ఆగస్టు 30న జరిగే టాలీవుడ్ అవార్డ్స్‌తో పాటు, ఆగస్టు 29న ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకను కూడా నిర్వహించేందుకు భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జ, కిరణ్ అబ్బవరం, శ్రీ విష్ణు, రోషన్, మీనాక్షి చౌదరి, దక్ష నాగర్కర్ వంటి యువ తారలతో పాటు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అగ్ర కథానాయకులు, టాప్ టెక్నీషియన్స్ హాజరు కానున్నారు.
ఊర్వశి రౌతేలా, కేతిక శర్మ, ఫరియా అబ్దుల్లా, ప్రియా హెగ్డే, శ్రీదేవి వంటి హీరోయిన్స్ స్పెషల్ పర్ఫార్మెన్స్‌లతో అలరించనున్నారు. అంతేకాకుండా, బ్రహ్మానందం, సుకుమార్, బుచ్చిబాబు, బాబీ, సాయి రాజేష్, దేవిశ్రీప్రసాద్, తమన్, అశ్విని దత్, డివివి దానయ్య, చంద్రబోస్, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా హాజరవనున్నారు. పలువురు టాలీవుడ్ అగ్రశ్రేణి నటీనటులు సర్ ప్రైజ్ గెస్ట్‌లుగా రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ప్రజా ఓటింగ్ ద్వారా అవార్డులు:
2024లో విడుదలైన చిత్రాల్లోని 24 క్రాఫ్ట్స్ కు చెందిన వివిధ నామినేటెడ్ విభాగాలకు ప్రజా ఓటింగ్ ప్రక్రియ ద్వారా అవార్డులు అందించబడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత, కళా రంగ ప్రముఖులు, ప్రతిభావంతులు, సినీ పరిశ్రమకు చెందిన లెజెండ్స్ ఈ GAMA అవార్డ్స్ 2025లో పాల్గొననున్నారు.
జ్యూరీ చైర్‌పర్సన్‌లు:
ఏ. కొదండ రామిరెడ్డి, కోటి, బి. గోపాల్ వంటి ప్రముఖులు GAMA అవార్డ్స్ 2025 జ్యూరీ చైర్‌పర్సన్‌లుగా వ్యవహరించనున్నారు.
GAMA అవార్డ్స్ చైర్మన్ త్రిమూర్తులు మాట్లాడుతూ, దుబాయ్‌లో జరిగే అతిపెద్ద తెలుగు వేడుక గామా అవార్డ్స్ అని, ఐదవ ఎడిషన్‌ను విజయవంతం చేయడానికి తెలుగు ప్రజలందరి సహకారం కోరారు.సీఈఓ సౌరభ్ కేసరి మాట్లాడుతూ.. ది గామా ఎక్సలెన్స్ అవార్డ్స్ ద్వారా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సత్కరిస్తామని తెలిపారు. 10 వేల మంది ఆసీనులు అయ్యేలా షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో ఏర్పాట్లు చేస్తున్నామని, వినూత్న డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు, వినోద కార్యక్రమాలు, అద్భుతమైన షోలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయని ఆయన వివరించారు.
గతంలో, GAMA 4వ ఎడిషన్‌లో 'ఆర్ఆర్ఆర్' చిత్రం గామా మూవీ ఆఫ్ ది డికేడ్ అవార్డును కైవసం చేసుకోగా, బెస్ట్ యాక్టర్ కేటగిరీలో అల్లు అర్జున్ (పుష్ప), నిఖిల్ (కార్తికేయ2), ఆనంద్ దేవరకొండ (బేబీ) అవార్డులను అందుకున్నారు. ఈసారి కూడా పలు పాపులర్ చిత్రాలు, స్టార్ హీరోలు, హీరోయిన్లు, టాప్ టెక్నీషియన్లు గామా అవార్డులను అందుకోనున్నారు.












Click it and Unblock the Notifications