AI ఇంజనీర్లకు ఈ నైపుణ్యం ఉంటే మంచి ఉద్యోగాలు పక్కా..!!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ప్రపంచాన్ని శాశిస్తోంది. అన్ని ప్రధాన రంగాల్లోనూ ఏఐ కు ప్రాధాన్యత పెరిగింది. ప్రభుత్వాలు సైతం ఏఐ వినియోగం పెంచుతున్నాయి. కొత్త యూనివర్సిటీ లను ఏర్పాటు చేస్తున్నాయి. కాగా, ఏఐ వినియోగానికి అనేక అప్లికేషన్లు ఉన్నాయి. ఈ జాబితాలో లాంగ్‌చెయిన్, లాంగ్‌గ్రాఫ్ కూడా వచ్చాయి. వీటిని తెలుసుకోవటం ద్వారా మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు దక్కించుకోవటం సులభంగా మారుతుంది. ఏఐ ఏజెంట్స్‌ను తయారుచేయడంలో ఇవి కీలకంగా మారుతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు లాంగ్‌చెయిన్ అండ్ లాంగ్‌గ్రాఫ్ తెలిసిన ఏఐ ఇంజినీర్లను తీసుకుంటున్నాయి.
ప్రస్తుతం ఏఐ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన కేటగిరీల్లో డిమాండ్ కనిపిస్తోంది. ఏఐ ఆధారిత సిస్టమ్స్, ఏజెంటిక్ వర్క్ ఫ్లోలను అభివృద్ధి చేయడం, ఎల్‌ఎల్‌ఎమ్స్‌ను ఇంటిగ్రేట్ చేయడం వంటి పనులు చేయగల నిపుణులు అవసరం అవుతున్నారు. డెవలపర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు పైతాన్, జావాస్క్రిప్ట్, టైప్‌స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో పట్టు ఉన్నవారు ఆ లాంగ్వేజెస్‌లో ఉన్న లాంగ్‌చెయిన్ ప్యాకేజీలను వాడుకునే వీలుంటుంది. లాంగ్‌గ్రాఫ్‌ను లాంగ్ చెయిన్‌కు ఒక కొనసాగింపుగా చెప్పవచ్చు. ఇది ఒక ఓపెన్‌సోర్స్ ఫ్రేమ్‌వర్క్. దీని సులభమైన ఇంటర్‌ఫేస్ ద్వారా వినయోగ దారులు వివిధ ఎల్‌ఎల్‌ఎమ్స్ మధ్య సులభంగా మారేందుకు అవకాశం ఉంటుంది. లాంగ్‌చెయిన్ ఒక లంకె మాదిరి చేయదగిన పనులకు ఉపయోగంగా ఉంటుంది.

లీనియర్ చెయిన్స్, రిట్రైవల్ ఫ్లో ఉపయోగించి ఇంటర్‌ఫేస్ అందిస్తుంది. నేరుగా, స్పష్టంగా ఉండే టాస్కులకు ఇది బాగుంటుంది. కానీ లాంగ్‌గ్రాఫ్ ఇలా కాదు. ఇది సైకిల్ గ్రాఫ్స్ వేస్తుంది. ఒక దాన్నుంచి మరోచోటికి వెళ్లే టాస్కులకు ఉపయోగపడుతుంది. డిప్లాయ్‌మెంట్ ఇంజినీర్, ఫ్రంట్‌ఎండ్ ఇంజినీర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీర్, ప్రొడక్ట్ డిజైనర్, ఫుల్‌స్టాక్ ఇంజినీర్, టెక్నికల్ డాక్స్ రైటర్, ఏఐ ఇంజినీర్, ఏఐ-ఎంఎల్ బ్యాక్‌ఎండ్ డెవలపర్, ప్రాంప్ట్ ఇంజినీర్, పైతాన్ డెవలపర్, జెనరేటివ్ ఏఐ ఇంజినీర్ ఇలాంటి ఎన్నో ఉద్యోగాల్లో ఈ స్కిల్ ద్వారా సమర్ధత నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ముందుగా లాంగ్‌చెయిన్‌లో అయితే చెయిన్స్, ప్రాంప్ట్స్, మోడల్స్ వంటి ప్రాథమిక అంశాలతో ప్రారంభించాలి. లాంగ్‌గ్రాఫ్‌ను నేర్చుకునేందుకు దీని గ్రాఫ్ స్ట్రక్చర్ మీద అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే అప్లికేషన్స్ తయారీలో ఇది ప్రధానం. విభి న్నమైన కేస్ స్టడీల ఆధారంగా సాధన చేయాలి. తద్వారా పూర్తి నైపుణ్యం పొందే అవకాశం ఏర్పడుతుంది.












Click it and Unblock the Notifications