గూగుల్.. ఉద్యోగాలు కుదేల్

టాప్ సెర్చింజిన్ గూగుల్.. తాజాగా మరో విడత లేఆఫ్స్ ప్రకటించింది. ఈ దఫా డిజైనర్లపై వేటు వేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ న అడాప్ట్ చేసుకున్న నేపథ్యంలో ఉద్యోగులను తొలగించింది. డిజైనింగ్ డివిజన్ లో 100 మందికి పైగా ఉద్యోగులను బయటికి పంపించింది. ఈ తొలగింపులు ఈ వారం ప్రారంభంలోనే జరిగాయి. క్లౌడ్ డివిజన్‌లోని "క్వాంటిటేటివ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ రీసెర్చ్", "ప్లాట్‌ఫామ్ అండ్ సర్వీస్ ఎక్స్‌పీరియన్స్" విభాగాలతో పాటు ఇతర విభాగాలపై కూడా తాజా లేఆఫ్ ప్రభావం పడింది.

తాజా లేఆఫ్స్ వేటు పడిన వాళ్లంతా కూడా డేటా, సర్వేలు, రీసెర్చ్ ద్వారా యూజర్ బిహేవియర్‌ను విశ్లేషించి ప్రొడక్ట్ డిజైన్‌ చేసే ఉద్యోగులే. కొన్ని క్లౌడ్ డిజైన్ టీమ్ లను కూడా సగానికి పైగా తగ్గించింది గూగుల్. వీరిలో మెజారిటీ అమెరికా చెందిన ఉద్యోగులు ఉన్నట్లు CNBC వెల్లడించింది. ప్రత్యామ్నాయ ఉద్యోగాలను వెతుక్కోవడానికి కొంతమందికి డిసెంబర్ 1వ తేదీ వరకు గడువు లభించింది. అప్పటివరకు వారికి వేతనాలు, ఇతర బెనిఫిట్స్ లభిస్తాయని గూగుల్ తెలిపింది.

Layoffs at Google 100 Design Positions Eliminated for AI Focus

AI రంగంలో గూగుల్ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటోంది. దీనికి అనుగుణంగా ఉద్యోగులను తొలగించుకుంటూ వస్తోంది. ఆయా డివిజన్లను పునర్వ్యవస్థీకరిస్తోంది. AI ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో మరిన్నిపెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో దీనికి అయ్యే వ్యయాన్ని లేఆఫ్స్ ద్వారా తగ్గించుకుంటోందని సీఎన్బీసీ తెలిపింది. అలాగు కొన్ని డివిజన్లలో రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్లుగా మారుస్తోంది.

కిందటి నెలలో జెమిని ఏఐ, AI ఓవర్‌వ్యూస్ వంటి టూల్స్ పై పనిచేస్తున్న 200 మందికి పైగా కాంట్రాక్టర్లను కూడా తొలగించింది గూగుల్. గ్లోబల్ బిజినెస్ యూనిట్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌పై పనిచేసే ప్లాట్‌ఫామ్స్, డివైసెస్ డివిజన్ లో కూడా ఉద్యోగులను తగ్గించింది. ఈ ఏడాది 2025 ప్రారంభం నుండి మానవ వనరులను తగ్గించుకుంటూ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ లెక్కన చూస్తే ఈ ఏడాది ఇది మూడో లేఆఫ్ గా చెప్పుకోవచ్చు.

హార్డ్‌వేర్, సెర్చింగ్, అడ్వర్టయిజ్మెంట్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, కామర్స్ విభాగాలలోని ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ ప్యాకేజీలను ప్రకటించింది గూగుల్ యాజమాన్యం. మేనేజ్మెంట్ లెవెల్స్ లల్లోనూ కోత పెట్టింది. ఈ క్రమంలో డివిజన్లను విలీనం చేసింది. మిడిల్ లెవెల్ మేనేజర్ల సంఖ్యను మూడింట ఒక వంతు కోత పెట్టింది. ఈ పునర్వ్యవస్థీకరణ.. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి దోహదపడుతోందని చెబుతోంది. అలాగే AI రిసోర్స్ డెవలప్మెంట్ వైపు ఆర్థిక వనరులను మళ్లించడానికీ వెసలుబాటు లభించిందని స్పష్టం చేస్తోంది. ఉద్యోగ కోతలు ఉన్నప్పటికీ- టెక్ రంగంలో గూగుల్ దే ఆధిపత్యం. గత ఏడాది డిసెంబర్ నాటికి కంపెనీలో 1,83,323 మంది ఉద్యోగులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+