గూగుల్.. భస్మాసుర హస్తం: భారీగా లేఆఫ్స్

టాప్ సెర్చింజిన్ గూగుల్.. తాజాగా మరో విడత లేఆఫ్స్ ప్రకటించింది. ఈ దఫా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లోనే కోత పెట్టింది. ఈ డివిజన్ లో 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. లేఆఫ్స్ ఎదుర్కొన్న వాళ్లందరూ కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులే. టెక్ రంగంలో చోటు చేసుకుంటోన్న భారీ మార్పుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని గూగుల్ వివరించింది. వివిధ డివిజన్లను పునర్వ్యవస్థీకరించనున్నట్లు తెలిపింది.

గూగుల్ కు జెమిని ఏఐ, ఏఐ ఓవర్‌వ్యూస్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాలు ఉన్నాయి. ఇందులో 200 మందికి పైగా ఉద్యోగులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తోన్నారు. తాజాగా వారందరినీ కూడా లేఆఫ్ చేసినట్లు గూగుల్ వెల్లడించింది. ఈ మేరకు ది వైర్డ్ ఓ కథనాన్ని ప్రచురించింది. గూగుల్ AI మోడళ్లను మెరుగుపరచడం, శిక్షణ ఇవ్వడంలో సహాయపడటానికి గతంలో గూగుల్.. గ్లోబల్‌లాజిక్ అనే ఔట్‌సోర్సింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని, ఇప్పుడు దీన్ని టెర్మినేట్ చేసిందని ఆ కథనం తెలిపింది.

Major Shakeup Google Lays Off 200 AI Contractors Amid Industry Changes

నిజానికి ఈ లేఆఫ్స్ అటు మెటా లేదా గూగుల్ తో సంబంధం లేదని, ఆ కంపెనీ ఔట్‌సోర్సింగ్ భాగస్వామి గ్లోబల్‌ లాజిక్ ఈ నిర్ణయాన్ని తీసుకుందని ది వైర్డ్ పేర్కొంది. గూగుల్ AI రేటింగ్ ప్రాజెక్ట్ లల్లో భాగస్వామింగా ఉంటోన్న గ్లోబల్‌లాజిక్, ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించిందని వివరించింది.

గతంలో తాము శిక్షణ ఇచ్చిన అధునాతన AI మోడల్స్.. తమ ఉద్యోగాలకే ముప్పుగా మారాయని గ్లోబల్ లాజిక్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. తనను ఉన్నపళంగా తొలగించారని, కారణం అడిగితే- గూగుల్ ఏఐ ప్రాజెక్టును నిలిపివేశామని గ్లోబల్ లాజిక్ వివరణ ఇచ్చిందని ఆండ్రూ లాజాన్ అనే ఉద్యోగి చెప్పారు. గ్లోబల్‌లాజిక్‌లో చేరిన ఏడాదిన్నరలోనే ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్లోబల్‌లాజిక్ నేరుగా నియమించుకున్న ఉద్యోగులకు గంటకు 28 నుండి 32 డాలర్ల వేతనం లభిస్తుండగా.. థర్డ్-పార్టీ ఏజెన్సీల ద్వారా వచ్చిన కాంట్రాక్టర్లకు అదే పనికి 18 నుండి 22 డాలర్లు మాత్రమే చెల్లించారు. అడ్వాన్స్‌డ్ డిగ్రీలు అవసరం లేని జనరలిస్ట్ రేటర్లు.. మరింత టఫ్ ప్రాజెక్టులలో పనిచేసినప్పటికీ వారికి ఇంకా తక్కువ వేతనం లభించిందని ఆండ్రూ లాజన్ తెలిపారు. ఈ లేఆఫ్స్ తో తమకు సంబంధం లేదని గూగుల్ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+