AI బూమ్.. ఢాం: డబ్బులు వేస్ట్- టెక్ కంపెనీలు యూటర్న్?

సర్వం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మయం అవుతున్న ప్రస్తుత పరస్థితుల్లో మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తన సొంత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగం మెటా సూపర్‌ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌ లో భారీ ప్రక్షాళనకు తెర తీశారు. పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. ఈ క్రమంలో ఈ డివిజన్ లో పెద్ద ఎత్తున లేఆఫ్స్ ప్రకటించే అవకాశాలు లేకపోలేదు.

ఇటీవలే మిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చించి AI ఇంజనీర్లను నియమించింది మెటా. ఇప్పుడు అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంది. ఉద్యోగుల తొలగింపులను చేపట్టాలని నిర్ణయించింది. జీపీటీ-5 ఆవిష్కరణ చోటు చేసుకున్న కొద్ది రోజులకే ఈ పరిణామం సంభవించడం కాకతాళీయంగానే చెప్పుకోవచ్చు. ఫలితంగా- AI బూమ్ తగ్గుతోందనే ఊహాగానాలకు దారితీసింది.

Massive Changes at Meta AI Engineers Face Uncertain Future Amid Restructuring

మెటా AI విభాగంలో భారీ మార్పులు జరుగుతున్నాయని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కొత్తగా ఏర్పాటు చేసిన మెటా సూపర్‌ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ (MSL) గ్రూప్‌ను ఇప్పుడు నాలుగు ప్రత్యేక డివిజన్లుగా విభజించింది. ఈ మేరకు మెటా కొత్త చీఫ్ AI ఆఫీసర్ అలెగ్జాండర్ వాంగ్.. తాజాగా ఓ మెమోను జారీ చేశారు.

  • 1. ప్రొడక్ట్
  • 2. రీసెర్చ్
  • 3. ఇన్‌ఫ్రా
  • 4. ఆపరేషన్స్..

సూపర్‌ ఇంటెలిజెన్స్ రంగంలో పోటీ తీవ్రంగా ఉందని, దీన్ని అందుకోవడానికి, గమ్యానికి చేరుకోవడానికి కీలకమైన రీసెర్చ్, ప్రొడక్ట్, ఇన్‌ఫ్రా వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అలెగ్జాండర్ వాంగ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఫౌండేషన్స్ గ్రూప్ ను రద్దు చేసినట్లు వెల్లడించారు.

ఈ క్రమంలో AI విభాగాన్ని మెటా కుదించడానికి యోచిస్తున్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ సైతం వెల్లడించింది. ఫలితంగా- కొంతమంది ఎగ్జిక్యూటివ్‌పై వేటు పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. మెటా తన సొంత సాంకేతికతపై మాత్రమే ఆధారపడకుండా- థర్డ్ పార్టీ AI మోడల్‌లను ఉపయోగించడం మొదలుపెట్టినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.

జనరేటివ్ AI గ్రూప్‌లో భాగమైన వైస్ ప్రెసిడెంట్ లోరెడానా క్రిసాన్.. మెటాకు గుడ్ బై చెప్పనున్నారని తెలిపింది. ఫిగ్మా ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లో ఆయనకు అవకాశం లభించినట్లు పేర్కొంది. ఈ క్రమంలో మరింతమంది ఎగ్జిక్యూటివ్స్, వివిధ విభాగాల వైస్ ప్రెసిడెంట్స్.. తమ దారి తాము చూసుకుంటోన్నట్లు వివరించింది.

మెటాలో నెలకొన్న ఈ అనిశ్చితి ఉద్యోగులను కలవరపరుస్తోంది. క్రిసాన్ వంటి కొంతమంది ఎగ్జిక్యూటివ్‌లు ఇప్పటికే రాజీనామా చేయడంతో అస్థిరత మరింత పెరిగింది. ఒకప్పుడు మెటా అతిపెద్ద గ్రోత్ ఇంజిన్‌గా భావించిన ఈ మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ లో ఈ మార్పులు సంభవిస్తోండటం.. మెటా యాజమాన్యం తీసుకున్న యూటర్న్ తీసుకున్నట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+