టెన్షన్ ఎందుకు దండగా.. AI ఉందిగా అండగా..
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) హవా నడుస్తోంది. అన్ని రంగాల్లోకి ఏఐ చొచ్చుకొస్తోంది. మానవులకు అనితర సాధ్యం కాని ఎన్నో క్లిష్టమైన సమస్యలకు ఏఐ పరిష్కారం చూపుతోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒక్కరేమిటీ.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ ఏఐ టూల్స్ ను వినియోగిస్తున్నారు. చాట్ జీపీటీ, గూగుల్ జెమిని, క్లాడ్, పెర్ ప్లెక్సిటీ ఇలా లెక్కలేనన్ని ఏఐ చాట్ బోట్స్ వారానికి ఒకటి పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే వీటిని ఎలా వాడాలి..? ప్రాంప్టింగ్ ఎలా ఇవ్వాలి..? ప్రశ్నలు, సందేహాలు ఎలా అడగాలి..?
మనకు తెలియని చాలా ప్రశ్నలు ఫ్రెండ్స్, పేరేంట్స్, రిలేటీవ్స్ ను అడుగుతుంటాం. వాళ్లకు తెలిస్తే చెప్తారు. లేదంటే విసుక్కుంటారు. కానీ ఏఐ చాట్ బోట్స్ మాత్రం అలా కాదు మనం అడిగే ఏ ప్రశ్నకు అయినా సమాధానం ఇస్తుంది. ఎలాంటి సందేహం అయినా క్షణాల్లో మన ముందుకు జవాబును తీసుకొస్తుంది. కానీ ఏఐను మనం ఎలా ప్రశ్నలు అడుగుతున్నాం.. ప్రాంప్టింగ్ ఎలా ఇస్తున్నాం అనేదే ముఖ్యం.
ఏఐ తో మనకు సమయం ఆదా అవుతుంది. క్వాలిటీ కంటెంట్ అందిస్తుంది. ఫేక్ న్యూస్ ను క్రాస్ చెక్ చేస్తుంది. క్రియేటివ్ గా సమాధానాలు ఇస్తుంది. ఎక్యూరసీ జవాబులు ఇస్తుంది. వేగంగా నేర్చుకునేందుకు ఏఐ ఉపయోగపడుతుంది. అయితే ఇవన్నీ ఇలా ఈజీగా రావాలంటే మనం ఏఐను ఎలా ప్రశ్నలు అడుగుతున్నామనేదే ముఖ్యం.
ప్రశ్న అడిగేముందు ఏది పడితే అది కాకుండా మనం అడిగే ప్రశ్నకు ఓ స్ట్రక్చర్ ఉండాలి. ఉదాహరణకు మనం ఒక యాత్రకు వెళ్లాలి అనుకున్నప్పుడు.. టాప్ 5 టూరిస్ట్ ప్లేసులు, ఫుడ్స్, ఫేమస్ రెస్టారెంట్స్, హోటల్స్ ఇలా ఓ పద్దతి ప్రకారం ప్రశ్నలు అడగాలి. ఆ తర్వాత మనం అడిగే ప్రశ్నలు క్లియర్ గా క్లారిటీగా ఉండాలి. ప్రాప్టింగ్ సరిగా ఇవ్వకపోతే జవాబు కూడా అలాగే వస్తుందని గమనించాలి.
మనం ఓ సమాచారాన్ని ఐదు బుల్లెట్ పాయింట్స్ రూపంలో ఇవ్వమని అడగాలి. ట్రాన్స్ లేట్, సమ్మరైజ్, రీఫ్రేజ్, క్రియేట్, కంపేర్ ఇలా మనకు ఏది కావాలో అది స్పష్టంగా ఏఐ కు చెప్పాల్సి ఉంటుంది. అలాగే మీకు ఏఐ ఇచ్చిన జవాబు నచ్చకపోతే లేదా ఇంకా కొత్తగా కావాలి అనిపిస్తే వెంటనే ప్రాంప్ట్ ను రీఫైన్ చేసుకోవాలి. దీంతో సమాచారాన్ని మరింత గ్రిప్పింగ్ గా ఏఐ అందిస్తుంది.

అలాగే ఉదాహరణలు కూడా ఏఐను అడగొచ్చు. మనకు ఏదైనా సమాచారం కావాల్సినప్పుడు ఆ సంఘటనకు సంబంధించిన ఉదాహరణలు కూడా అడగొచ్చు. అంతేకాక ఏఐ కి మనం ఓ పని అప్పజెబితే అది ఇంకా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఉదాహరణకు మనకు కోచ్ గా మారి పలు సూచనలు ఇవ్వు అన్నప్పుడు వెంటనే కోచ్ గా మారిపోతుంది. నీతి వాఖ్యాలు బోధిస్తుంది. ఆలోచనాత్మక విషయాలు చెబుతుంది. స్ఫూర్తిని కూడా నింపుతుంది.
ఇలా ఏ విషయాన్ని అయినా స్టెప్ బై స్టెప్ వివరిస్తూ ఏఐ మనకు అన్ని విధాలా సాయ పడుతోంది.












Click it and Unblock the Notifications