అమెజాన్ లో భారీగా లేఆఫ్స్- వేలల్లో ఉద్యోగుల తొలగింపు

ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. మరోసారి వేల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించడానికి సన్నద్ధమౌతోంది. వచ్చే వారంలోనే ఈ తొలగింపుల ప్రక్రియ ఉండొచ్చని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. మేనేజ్మెంట్ లెవెల్ ను క్రమబద్ధీకరించడం, ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ సంస్థ అంతర్గత వర్గాలను బ్లూమ్‌బెర్గ్ తన కథనానికి ఉటంకించింది.

ఈ తాజా రౌండ్ ఉద్యోగాల కోతల సంఖ్య ఎంత ఉంటుందనేది తెలియరావట్లేదు. సుమారు 14,000 మంది ఉద్యోగులను తొలగించడానికి ప్రణాళికలు రూపొందించుకున్నట్లు గత ఏడాది వెల్లడించిందీ సంస్థ యాజమాన్యం. 2026లో మరిన్ని లేఆఫ్స్ ఉంటాయని పేర్కొంది. అనవసర ఖర్చులను కుదించుకోవడం, లేఆఫ్స్ చేయదగ్గ డివిజన్లు ఉన్నట్లు గుర్తించామని, ఈ కోతలు తప్పకపోవచ్చని అప్పట్లో స్పష్టం చేసింది. దీన్ని వచ్చేవారం కార్యాచరణలో పెట్టొచ్చని బ్లూమ్‌బెర్గ్ అంచనావేసింది.

Multiple Reports claims Amazon Maps Out Thousands of Corporate Reductions Next Week

తాజా లేఆఫ్.. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), రిటైల్ విభాగాలు, ప్రైమ్ వీడియో, పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీగా పిలిచే మానవ వనరుల విభాగాల్లో ఉండొచ్చని తెలుస్తోంది. అమెజాన్ లో అత్యంత కీలకమైన హాలిడే షాపింగ్ క్వార్టర్ ముందు చోటు చేసుకుంటోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని తర్వాత దశలవారీగా కొనసాగుతాయి. సియాటిల్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ 2022 చివరిలో, 2023 ప్రారంభంలో 27,000 ఉద్యోగాలు తగ్గించింది. ప్రస్తుత కోతలు కూడా అదే స్థాయిలో ఉంటాయని భావిస్తున్నారు.

గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.57 మిలియన్ల మంది ఉద్యోగులను నియమించింది. వీరిలో ఎక్కువ మంది గోడౌన్లల్లో పనిచేసే వాళ్లే. వారిని తొలగించట్లేదు యాజమాన్యం. తాజా లేఆఫ్ ప్రధానంగా కార్పొరేట్ స్థాయి ఉద్యోగులపైనే పడబోతోంది. కార్పొరేట్ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ లో 3,50,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో ఎంతమందిని తొలగిస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

వాషింగ్టన్ స్టేట్ 'వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ యాక్ట్ (WARN Act) ప్రకారం.. కంపెనీలు తమ ఉద్యోగాల తొలగింపులను స్థానిక అధికారులకు ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది. ముందస్తు నోటీసు ఇచ్చిన 90 రోజుల్లోగా దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయాలి. ఈ నిబంధనను పాటిస్తూ అమెజాన్ తొలగింపుల గురించి ముందస్తు సమాచారం అందించింది కూడా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+