AI, ఎంఎల్ సహా 150 కోర్సులకు ఆన్ లైన్ శిక్షణ - అర్హత, దరఖాస్తులు..!!

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్. ప్రధాన రంగాల్లో ఇప్పటికే ఏఐ వినియోగం కీలక దశకు చేరుకుంది. ఇప్పుడు ప్రతీ రంగంలోనూ ఏఐ కీలకంగా మారుతోంది. ప్రభుత్వం, ప్రయివేటు వ్యవస్థలు ఏఏఐకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఏఐకి ప్రత్యేకం గా గుర్తింపు దక్కు తోంది. దీంతో, ప్రముఖ విద్యా సంస్థలు సైతం ఏఐ కోర్సులకు వస్తున్న డిమాండ్ కు అనుగుణం గా శిక్షణ.. బోధనలో మార్పులు తెస్తున్నాయి. ఇదే సమయంలో ఆన్ లైన్ ద్వారా ఏఐ తో పాటుగా ఎంఎల్ .. సాఫ్ట్ వేర్ కోర్సులకు ఆన్ లైన్ శిక్షణ అందుబాటులోకి వచ్చింది.

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ స్కిల్ అకాడమీ ద్వారా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఏఐ & ఎంఎల్, డేటా సైన్స్ లో పీజీ డిప్లొమా, డిప్లొమా కోర్సులతో పాటు 150 కి పైగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సులకు ఆన్‌లైన్‌లో శిక్షణ, ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రోగ్రామ్ ఇంటర్ పాస్, ఇంజినీరింగ్ , డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. నేషనల్ స్కిల్ అకాడమీ విద్యార్థులు సరికొత్త సాఫ్ట్వేర్ టెక్నాలజీలలో తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని అందిస్తోంది. కాగా, ఇందుకు సంబంధించి దరఖాస్తుల విధానం పైన కీలక అంశాలను వెల్లడించింది. శిక్షణ కోసం ఆసక్తి ఉన్న వారు ఏఐ & ఎంఎల్, డేటా సైన్స్ లో పీజీ డిప్లొమా, డిప్లొమా కోర్సులతో పాటు 150 కి పైగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల నుండి ఏదైనా కోర్సు ఎంపిక చేసుకోవచ్చు.

national-skill-academy-latest-announcement-over-online-training-classes-for-ai-ml-courses

ఇక.. బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, పైథాన్, మెషిన్ లెర్నింగ్ మరియు బిజినెస్ అనలిటిక్స్ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, బ్లాక్‌చెయిన్, డీప్ లెర్నింగ్, సెలీనియం, సేల్స్‌ ఫోర్స్, జావా, ఒరాకిల్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, వెబ్ డిజైన్ కోర్సు లతో పాటు 150 కి పైగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల నుండి ఏదైనా కోర్సు ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. కాగా, కోర్సులు ఈ-లెర్నింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో శిక్షణ అందించబడుతుంది, తర్వాత పరీక్షలను నిర్వహిస్తారు. పాస్ అయిన విద్యార్థులు ఉచితంగా కేంద్ర ప్రభుత్వ ఆమోదించిన సర్టిఫికేట్‌ను అందుకుంటారు. కోర్సు వ్యవధి 2 నెలల నుండి 10 నెలల వరకు ఉంటుంది, సబ్జెక్ట్‌లో ఇన్‌ డెప్త్ నాల్డెజ్ పొందేందుకు విద్యార్థులకు ఇది చక్కటి అవకాశంగా నిలుస్తోంది. ఈ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు విదేశాలలో అధిక వేతనాలతో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నయని చెబుతున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.nationalskillacademy.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+