మెటా కొత్త AI టూల్: మౌస్, కీబోర్డ్ ద్వారా బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం బయటికి
టాప్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మెటా తాజా సంచలనానికి తెర తీసింది. మౌస్ కదలికలను ట్రాక్ చేసే కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయనుంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. దీనిపై ఉద్యోగులందరికీ కూడా మెమోను సైతం పంపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి, విధి నిర్వహణలో ఉన్న సమయంలో కార్యకలాపాలపై నిఘా ఉంచడానికి ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లను స్వయంప్రతిపత్తితో నిర్వహించేలా తీర్చిదిద్దాలనేదే దీని ఉద్దేశమని మెటా పేర్కొంది. ఈ మేరకు మెటా వర్గాలను ఉటంకిస్తూ రాయటర్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కంప్యూటర్లను ఉపయోగించి రోజువారీ పనులను పూర్తి చేయడానికి ప్రజలకు సహాయపడే ఏఐ టూల్స్ నుఅభివృద్ధి చేస్తోన్నామని, యూజర్లు రియల్ టైమ్ లో వాటిని ఎలా ఉపయోగిస్తారనే దానికి సంబంధించిన డేటా అవసరమని మెటా పేర్కొంది.

ఇందులో భాగంగా ఏఐ టూల్స్ పై పని చేస్తోన్న ఉద్యోగులందరి మౌస్ కదలికలు, కీబోర్డ్ బటన్‌లను క్లిక్ చేయడం, డ్రాప్‌డౌన్ మెనులను నావిగేట్ చేయడం వంటివి దీని పరిధిలోకి తీసుకొచ్చామని వివరించింది. రియల్ టైమ్ టూల్ మోడళ్లకు శిక్షణ ఇవ్వడంలో సహాయపడటానికి కొన్ని అప్లికేషన్‌లలో ఈ రకమైన ఇన్‌పుట్‌లను ట్రాక్ చేసే సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేయనున్నామని మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ రాయటర్స్ కు తెలిపారు.
ఈ డేటా పనితీరు మొత్తాన్ని కూడా ఉద్యోగుల వర్క్ అసెస్మెంట్లతో సంబంధం ఉండదని, ఏఐ టూల్ పనితీరును పర్యవేక్షించడానికి మాత్రమే ఉపయోగిస్తామని అన్నారు. ఈ AI టూల్.. సెలెక్టెడ్ వర్క్ యాప్స్, వెబ్‌సైట్లకు ఉపయోగపడుతుంది. ఉద్యోగుల పని విధానాలను అర్థం చేసుకోవడానికి ఇది ఎప్పటికప్పుడు స్క్రీన్ స్నాప్‌షాట్‌లను ట్రాక్ చేస్తుంది. కొత్త డిజైన్ ఏఐ టూల్స్ రికగ్నైజేషన్ తో పాటు అందులో ఉండే లోపాలను మెరుగుపరుచుకోవడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది.
డ్రాప్‌డౌన్ మెనుల నుండి అవసరమైన కేటగిరీని సెలెక్ట్ చేసుకోవడం, కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించడం వంటి కార్యకలాపాల్లో ఈ ఏఐ టూల్ ఇంకా ఇబ్బంది పడుతోందని, దీన్ని మరింత మెరుగుపర్చాల్సి ఉందని మెటా పేర్కొంది. కంప్యూటర్ లాగింగ్, స్క్రీన్ షాటింగ్ టెక్నాలజీని పలు టెక్ సంస్థలు ఇప్పటికే వినియోగిస్తోన్నాయి. ఉద్యోగుల పని వేళలకు మాత్రమే అవి పరిమితం అయ్యాయి. దీనికి భిన్నంగా మెటా.. రియల్ టైట్ ఏఐ టూల్ డెవలప్మెంట్ కోసం దీన్ని ప్రవేశపెట్టనుంది.












Click it and Unblock the Notifications