Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గూగుల్‌కి బిగ్ షాక్.. ఓపెన్‌ ఏఐ కొత్త బ్రౌజర్ "అట్లాస్" లాంఛ్ !

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) ప్రస్తుతం ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తోంది. విద్య, ఆరోగ్యం, వినోదం, వ్యాపారం, టెక్నాలజీ అన్ని రంగాల్లో ప్రతి చోటా AI తన ముద్ర వేసింది. అయితే ప్రజల్లో ఈ సాంకేతికతను విస్తృతంగా పరిచయం చేసినది ఓపెన్‌ఏఐ రూపొందించిన చాట్‌జీపీటీ అనే చెప్పాలి. అడిగిన ప్రశ్నకు తక్షణమే సమాధానం ఇవ్వడం దీని ప్రత్యేకతగా నిలిచింది. ఈ విప్లవాత్మక టెక్నాలజీ ప్రపంచంలో కొత్త ఒరవడిని సృష్టించింది.

ఓపెన్‌ఏఐ కొత్త సంచలనం..

చాట్‌జీపీటీ సూపర్ సక్సెస్ కావడంతో ఓపెన్‌ఏఐ ఇప్పుడు మరో పెద్ద అడుగు వేసింది. లేటెస్ట్ గా "అట్లాస్" (Atlas) అనే అత్యాధునిక AI ఆధారిత వెబ్ బ్రౌజర్‌ను ప్రారంభించింది. ఇది సాధారణ బ్రౌజర్ కాదని.. మానవ-యంత్ర సంభాషణను నూతన స్థాయికి తీసుకెళ్తుందని సంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన గూగుల్ క్రోమ్‌కు ఇది గట్టి పోటీగా నిలవనుంది.

Open AI launches new browser Atlas

చాట్‌జీపీటీ ద్వారా ఓపెన్‌ఏఐ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 మిలియన్ల వినియోగదారులను సంపాదించినప్పటికీ, వాటిలో ఎక్కువ మంది ఉచిత వినియోగదారులే. దీంతో సంస్థకు పెద్దగా ఆదాయం రాలేదు. ఈ నేపథ్యంలో, ఆర్థిక లాభాలను పెంచుకునే ఉద్దేశ్యంతో ఓపెన్‌ఏఐ "అట్లాస్"‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చిందని భావిస్తున్నారు. ఇది కేవలం కొత్త ఉత్పత్తి కాదని.. ఓపెన్‌ఏఐ వ్యాపార నమూనాను మార్చే ప్రయత్నం కూడా అని అంచనా వేస్తున్నారు.

ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ మాట్లాడుతూ - "బ్రౌజర్‌ అంటే ఏమిటి, దానిని ఎలా ఉపయోగించాలి అన్నదానిపై ప్రజలు తిరిగి ఆలోచించేలా 'అట్లాస్' రూపొందించబడింది" అన్నారు.
ఇకపై యూజర్లు లింకులు వెతకడం కాకుండా AIతో మాట్లాడడం ద్వారా సమాచారం పొందగలరని పేర్కొన్నారు. అట్లాస్‌లో సాంప్రదాయ URL బార్ స్థానంలో AI చాట్ ఇంటర్‌ఫేస్ ఉంటుందని స్పష్టం చేశారు.

మూడు ప్రధాన ప్రత్యేకతలు..

ఏ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసినా, దాని పక్కన చాట్‌జీపీటీ సైడ్‌బార్ కనిపిస్తుంది. మీరు చదివే కంటెంట్‌ను అర్థం చేసుకోవడానికి, డేటాను విశ్లేషించడానికి ఇది సహాయపడుతుంది. "కర్సర్ చాట్" ఫీచర్‌ ద్వారా యూజర్లు ఇమెయిల్స్‌, పత్రాల్లోని పేరాలను హైలైట్‌ చేసి, వాటిని AI ద్వారా వెంటనే మెరుగుపరచుకోవచ్చు.

అట్లాస్‌ మీ బ్రౌజింగ్ హిస్టరీని సురక్షితంగా గుర్తుంచుకుంటుంది. మీరు గతంలో చూసిన సైట్‌ల ఆధారంగా AI విశ్లేషణ చేస్తుంది. ఉదాహరణకు, మీరు ఉద్యోగ వెబ్‌సైట్‌లు చూస్తుంటే, AI ఆటోమేటిక్‌గా పరిశ్రమ ట్రెండ్‌ల రిపోర్ట్ అందిస్తుంది. హిస్టరీని యూజర్ ఎప్పుడైనా చూడగలరు లేదా తొలగించగలరు.

ప్లస్‌, ప్రో‌, బిజినెస్ వినియోగదారుల కోసం అందుబాటులో ఉన్న ఏజెంట్ మోడ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది రిజర్వేషన్లు బుక్ చేయడం, ఆన్‌లైన్ షాపింగ్ చేయడం, పరిశోధనలు నిర్వహించడం, లేదా ఫారమ్‌లు నింపడం వంటి పనులను స్వయంగా చేస్తుంది.

ప్రస్తుతం ఆపిల్ ల్యాప్‌టాప్‌లలో ప్రారంభమైన అట్లాస్‌, త్వరలో విండోస్‌, ఐఫోన్‌, ఆండ్రాయిడ్ పరికరాల్లో కూడా అందుబాటులోకి రానుంది. ఈ విస్తరణతో ఓపెన్‌ఏఐ, బ్రౌజర్ మార్కెట్లో బలమైన స్థానం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అట్లాస్ ప్రకటన అనంతరం, గూగుల్ స్టాక్ 3% తగ్గింది. పెట్టుబడిదారులు దీన్ని క్రోమ్ ఆధిపత్యానికి భవిష్యత్ ముప్పుగా భావిస్తున్నారు. అట్లాస్ విజయం సాధిస్తే, సెర్చ్ ఇంజిన్ మార్కెట్‌లో గూగుల్ దశాబ్దాల రాజ్యానికి సవాలు అవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+