కొంప ముంచిన TCS

TCS Layoffs: దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగుల కుదింపు అంచనాలకు మించి ఉంటోంది. అనుకున్నదాని కంటే అధిక ప్రభావం చూపుతోంది. లేఆఫ్స్ ను ప్రకటించిన తర్వాత ఈ సంస్థలో భారీ పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. దీని ప్రభావం అటు టెక్ ఇండస్ట్రీ మొత్తం మీద పడుతోంది. అటు ఆ కంపెనీ ఆర్థిక ఫలితాల మీద కూడా లేఆఫ్స్ ప్రభావానికి కొంతమేరకు లోనైనట్టే కనిపిస్తోంది.

లేఆఫ్స్ కింద వేలాదిమంది ఉద్యోగులను తొలగించాలని టీసీఎస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. తన మొత్తం ఉద్యోగుల్లో రెండు శాతం అంటే దాదాపు 12,000 మంది ఉద్యోగులను లేఆఫ్ కింద తొలగించింది. ఈ తొలగింపులు మిడిల్, సీనియర్ లెవెల్ ఉద్యోగులకు వర్తింపజేసే అవకాశాలు ఉన్నాయి. సాంకేతిక రంగంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సంస్థను తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గతంలో వెల్లడించింది.

TCS Reports Major Job Cuts as broad restructuring exercise and layoffs impacting in Q2 FY26

ఇది అక్కడి వరకే పరిమితం కాలేదు. దీని తర్వాత కూడా కొనసాగింది. మరో 6,000 మందికి పైగా ఉద్యోగులపై వేటు వేసింది టీసీఎస్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో19,755 మంది ఉద్యోగుల తొలగించినట్లు తాజాగా వెల్లడించింది. ఈ తగ్గింపుతో, టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,13,069కి చేరుకుంది. ఈ విషయాన్ని అక్టోబర్ 9న విడుదల చేసిన ఆర్థిక నివేదికలో పేర్కొంది. గత జూన్ త్రైమాసికంలో కంపెనీ 5,090 మంది ఉద్యోగులను అదనంగా నియమించుకున్న తర్వాత ఈ తగ్గింపు నమోదైంది.

ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఐటీ దిగ్గజం, సెప్టెంబర్ త్రైమాసికంలో పునర్నిర్మాణ ఖర్చుల కింద రూ. 1,135 కోట్లు కేటాయించింది. సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా చేపట్టిన ఈ చర్యల వల్ల కంపెనీ నికర లాభం రూ. 12,075 కోట్లకు చేరింది. ఇది అంచనాల కంటే స్వల్పంగా తక్కువ. ఉద్యోగాల కోత ఉన్నప్పటికీ, కొత్త నియామకాలు 13.3 శాతానికి పెరిగాయి. ఇది అంతకుముందు త్రైమాసికంతో పోల్చుకుంటే తక్కువే. గతంలో ఈ నియామకాలు 13.8 శాతంగా ఉంది.

టీసీఎస్ ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి ప్రయత్నాలపై అధికంగా ఆధారపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులు మొత్తం 3.3 కోట్ల లెర్నింగ్ గంటలు పూర్తి చేశారు. ప్రస్తుతం సుమారు 1.6 లక్షల మంది ఉద్యోగులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఎక్స్ పర్ట్స్ టీసీఎస్ లో ఉన్నారు. రెండో త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ. 65,799 కోట్లకు పెరిగింది. ఇది క్రితం త్రైమాసికం కంటే 3.7 శాతం పెరిగింది. ఆపరేటింగ్ మార్జిన్ 70 బేసిస్ పాయింట్లు పెరిగి 25.2 శాతానికి చేరుకోగా, నికర మార్జిన్ 19.6 శాతంగా నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+