TCS కు లేబర్ కమిషన్ సమన్లు: వరుస Layoffs పై సీరియస్
TCS Layoffs: దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగుల కుదింపు అంచనాలకు మించి ఉంటోంది. అనుకున్నదాని కంటే అధిక ప్రభావం చూపుతోంది. లేఆఫ్స్ ను ప్రకటించిన తర్వాత ఈ సంస్థలో భారీ పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. దీని ప్రభావం అటు టెక్ ఇండస్ట్రీ మొత్తం మీద పడుతోంది. అటు ఆ కంపెనీ ఆర్థిక ఫలితాల మీద కూడా లేఆఫ్స్ ప్రభావానికి కొంతమేరకు లోనైనట్టే కనిపిస్తోంది.
లేఆఫ్స్ కింద వేలాదిమంది ఉద్యోగులను తొలగించాలని టీసీఎస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. తన మొత్తం ఉద్యోగుల్లో రెండు శాతం అంటే దాదాపు 12,000 మంది ఉద్యోగులను లేఆఫ్ కింద తొలగించింది. ఈ తొలగింపులు మిడిల్, సీనియర్ లెవెల్ ఉద్యోగులకు వర్తింపజేసే అవకాశాలు ఉన్నాయి. సాంకేతిక రంగంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సంస్థను తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గతంలో వెల్లడించింది.

ఇది అక్కడి వరకే పరిమితం కాలేదు. తాజాగా మరో రెండు శాతం మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. ఈ పరిణామాల మధ్య టీసీఎస్ కు భారీ షాక్ తగిలింది. పుణే కార్మిక మంత్రిత్వ శాఖ కమిషనర్.. సమన్లు జారీ చేశారు. నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ఫిర్యాదుల మేరకు ఈ సమన్లు జారీ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల్లో రెండు శాతం మందిని తొలగించాలని TCS యోచిస్తున్న నేపథ్యంలో ఈ ఫిర్యాదులు అందాయి.
దీనిపై ఈ నెల 18వ తేదీన విచారణ జరగనుంది. టీసీఎస్ ప్రతినిధులు లేబర్ కమిషనర్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఉన్నపళంగా ఉద్యోగులను తొలగించడానికి గల కారణాలను లిఖితపూరకంగా తెలియజేయాల్సి ఉంది. దీనిపై సంతృప్తికర వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. గత కొన్ని నెలలుగా పుణెలో 2,500 మంది మిడిల్, సీనియర్ స్థాయి ఉద్యోగులను TCS అక్రమంగా తొలగించిందని ఆరోపిస్తూ NITES మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు విజ్ఞప్తి చేసింది.
ఫిర్యాదులతో వారు అసోసియేషన్ ప్రతినిధులు అందజేసిన డాక్యుమెంట్లను సమగ్రంగా సమీక్షించిన తర్వాత కార్మిక మంత్రిత్వ శాఖ స్పందించింది. సమన్లు ఇచ్చింది. కార్మిక శాఖ అమలు చేస్తోన్న నిబంధనలు, ఇతర మార్గదర్శకాలను ప్రతి సంస్థ యజమాన్యం కూడా చట్టబద్ధంగా పాటించాల్సి ఉంటుందని, ఎవ్వరు కూడా కార్మిక చట్టాలను ఉల్లంఘించలేరని నైట్స్ తెలిపింది. విచారణ సందర్భంగా తమ వాదనలను వినిపిస్తామని పేర్కొంది.












Click it and Unblock the Notifications