Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారీ లేఆఫ్స్ ప్రకటించిన టెక్ జెయింట్?

టెక్ దిగ్గజం ఇంటెల్.. ఉద్యోగాల కోతను చేపట్టింది. సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆటోమోటివ్ చిప్ యూనిట్‌ ను మూసివేస్తోంది. కాలిఫోర్నియా శాంటా క్లారా ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను కొనసాగిస్తోన్న ఈ సంస్థ.. మలి విడత లేఆఫ్స్ ను ప్రకటించినట్లు తెలుస్తోంది.

ఈ ఉద్యోగాల తొలగింపు జూలై 15వ తేదీన ప్రారంభమవుతుందని సమాచారం. అ మేరకు కాలిఫోర్నియా వర్కర్స్ అడ్జస్ట్ మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (WARN) కు తెలియజేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను అందజేసింది. 30 రోజుల వ్యవధిలో 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చినప్పుడు ఏ సంస్థ అయినా ఈ నిబంధనను తప్పనిసరి పాటించాలి.

Tech Layoffs Intel plans to cut jobs

జర్మనీ మ్యూనిచ్ నుండి పనిచేస్తున్న తన ఆటోమోటివ్ చిప్ వ్యాపారాన్ని కూడా ఇంటెల్ మూసివేస్తోంది. తాజాగా ఈ యూనిట్.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంది. ఫలితంగా మ్యాన్ పవర్ ను తగ్గించాలని నిర్ణయించింది. సాఫ్ట్‌వేర్-డిఫైన్డ్ వెహికల్ ప్లాట్‌ఫారంలపై ఇది పనిచేస్తోంది. దీనివల్ల ఈ యూనిట్‌ లో భారీగా ఉద్యోగాల కోత పెట్టనుంది ఇంటెల్.

ఈ విభాగంలో సుమారు 20 శాతం వరకు కోత పెట్టే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. తొలగింపుకు గురైన ఉద్యోగులకు 60 రోజులు/ నాలుగు వారాల నోటీసుతో పాటు తొమ్మిది వారాల పరిహారం, ఇతర బెనిఫిట్స్ అందిస్తామని కంపెనీ తెలిపింది. సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించే ప్రయత్నంలో భాగంగా 15 నుండి 20 శాతం మందిని తొలగిస్తామని ఇంటెల్ సీఈఓ టాన్ గతంలో ప్రకటించారు.

దీనికి అనుగుణంగా లేఆఫ్స్ ను తెర మీదికి తీసుకొచ్చిందా టెక్ జెయింట్. చిప్ డెవలప్మెంట్ సహా కీలక ఇంజినీరింగ్ డివిజన్లపై తాజా లేఆఫ్స్ ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. సాఫ్ట్ వేర్ డెవలపర్లు, ఇంజినీర్లు, లాజిక్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, క్లౌడ్ సాఫ్ట్‌ వేర్ ఆర్కిటెక్ట్‌లు ఇందులో ఉన్నారని తెలుస్తోంది.

ఇంజినీరింగ్ మేనేజర్లు, బిజినెస్ లీడ్స్, ఐటీ వింగ్ వైస్ ప్రెసిడెంట్ వంటి సీనియర్ ర్యాంక్ ఉద్యోగులు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఉద్యోగాల తొలగింపులతో పాటు ఇంటెల్ తన మార్కెటింగ్ కార్యకలాపాలను యాక్సెంచర్‌కు అవుట్‌ సోర్స్ ఇవ్వాలని యోచిస్తోంది. కస్టమర్ కమ్యూనికేషన్ కార్యకలాపాలను నిర్వహించడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+