వంటింట్లో పనిమనిషి దొంగతనం, AI తో పట్టుకున్న ఓనర్
బెంగళూరు.. ఐటీ హబ్. ఒక టెక్ నిపుణుడి ఇంట్లో 'నిశ్శబ్ద యుద్ధం' నడుస్తోంది. ఫ్రిజ్‌లో పెట్టిన ఆపిల్స్ మాయమవుతున్నాయి.. అరటిపండ్లు హఠాత్తుగా అదృశ్యమవుతున్నాయి. దొంగ ఎవరో తెలుసు.. కానీ సాక్ష్యం లేదు. అక్కడే మొదలైంది ఆ టెక్ నిపుణుడి అసలు సిసలు 'సినిమాటిక్ స్కెచ్'!
పంకజ్ తన్వార్.. తనను తాను 'సీరియల్ ఇన్నోవేటర్' అని పిలుచుకునే ఈ టెక్ నిపుణుడు, తన వంట మనిషి ప్రవర్తనపై నిఘా పెట్టాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆయన పెట్టింది సాధారణ సీసీటివీ కెమెరా కాదు.. ఒక "డిజిటల్ డిటెక్టివ్"! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఒక అత్యాధునిక నిఘా వ్యవస్థను వంటగదిలో సెట్ చేశాడు. పని మనిషి ప్రతి కదలికను విశ్లేషించేలా, ప్రతి చిన్న మార్పును రిపోర్ట్ చేసేలా ప్రోగ్రామ్ చేశాడు.

రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన 'ఫ్రూట్ తీఫ్'!
ఆ AI వ్యవస్థ ఒక వేటగాడిలా పని మొదలుపెట్టింది. వంట మనిషి లోపలికి రావడమే ఆలస్యం.. సెన్సార్లు యాక్టివేట్ అయ్యాయి. ఆ "AI రూమ్‌మేట్" పంపిన రిపోర్ట్ చూసి పంకజ్ షాక్ తిన్నాడు. "సార్.. ఆమె లోపలికి వచ్చింది.. ఎవరూ లేరని చూసుకుంది.. ఫ్రిజ్ తెరిచింది.. రెండు ఆపిల్స్ జేబులో వేసుకుంది! ఈరోజు ఆమె చేతులు కడుక్కోకుండానే కూరగాయలు తరిగేసింది!. స్టవ్ వెనుక మురికిని ఆమె పట్టించుకోవడం లేదు!"
ఇలా సెకన్ల వ్యవధిలో ఆమె జాతకాన్ని AI బయటపెట్టేసింది. ఆపిల్స్, బ్లూబెర్రీస్, అరటిపండ్లు.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మూడు సార్లు ఆమె అడ్డంగా బుక్కైపోయింది.
ఒక్క పండు.. ఒక నిరుద్యోగి!
సాక్ష్యాలతో సహా దొరకడంతో, పంకజ్ క్షణం కూడా ఆలోచించకుండా ఆమెను పనిలోంచి తొలగించాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు డ్రామా మొదలైంది. నెలకు రూ.4,800 ఇచ్చే ఉద్యోగం కోసం, వేల రూపాయల AI టెక్నాలజీతో ఆమె ప్రైవసీని దెబ్బతీయడం ఏంటని సోషల్ మీడియాలో యుద్ధం నడుస్తోంది. "ఆమె దొంగిలించింది ఆకలి తీర్చుకోవడానికి ఒక పండు మాత్రమే.. దానికి అంత శిక్షా?" అని కొందరు ప్రశ్నిస్తుంటే.. "దొంగతనం ఏదైనా దొంగతనమే" అని పంకజ్ సమర్థించుకుంటున్నారు.
-
పిచ్చెక్కించే ఫీచర్లతో Portronics Beem 570 ప్రొజెక్టర్.. ఎంతంటే ?? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications