AI: మారిపోతున్న జాబ్​ స్కిల్స్ - రేసులో ఉండాలంటే ఇవి​ తప్పనిసరి..!!

ప్రపంచం మారిపోతోంది. ఏఐ ప్రవేశంతో ఒక్క సారిగా సాంకేతికతలో మార్పు మొదలైంది. ఆ మార్పు విప్లవంలా కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న జాబ్ స్కిల్స్ స్వరూపం రానున్న అయిదేళ్లు కాలంలో మొత్తంగా మారిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా.. ఏఐ ఆధారిత కోర్సులకు ప్రాధాన్యత పెరుగుతోంది. మార్కెట్ లో నిలబడాలంటే కొత్త కోర్సుల వైపు చూడాల్సిందే. నైపుణ్యం ఆధారంగానే ఉద్యోగం దొరికే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో కొత్త స్కిల్స్ లో ప్రావీణ్యం మాత్రమే మనకు ఉద్యోగానికి ఆధారం కానున్నాయి.

లింక్డిన్​ సంస్థ తాజా అంచనాల ప్రకారం 2030 నాటికి ఇప్పుడున్న జాబ్​ స్కిల్స్​లో దాదాపు 70 శాతం వరకు మారిపోతాయి. మారుతున్న కాలనికి అనుగుణంగా డీప్​ లెర్నింగ్​ ఫ్రేమ్​ వర్క్ లో పైటార్స్​ ఆదరణ పెరిగింది. ఏఐ, మెషిన్​ లెర్నింగ్​ ఇంజినీర్లకు ఇది కచ్చితంగా నేర్చుకోవాల్సిన నైపుణ్యంగా చెబుతున్నారు. దీని ద్వారా ప్రోటోటైపింగ్​, న్యూరల్​ నెట్​వర్క్స్​ డెవలప్​మెంట్​, మోడల్​ ట్రైనింగ్​ వేగంగా మారుతున్నాయి. ఈ పైటార్చ్​ కోర్సుల్లో టెన్సర్​ ఆపరేషన్స్​, మోడల్​ బిల్డింగ్, బ్యాక్​ ప్రోపగేషన్​, రియల్​ వరల్డ్​ ఏఐ అప్లికేషన్​ వంటివి నేర్పిస్తారు. దీని ద్వారా రానున్న రోజుల్లో పరిశ్రమ అవసరాలు, ఏఐ రీసెర్చ్​కు ఈ నిపుణులు ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు.

the-skills-required-for-the-average-job-will-have-changed-by-next-five-years

ఏఐలో ప్రావీణ్యం అదనపు నైపుణ్యంగా కాదు.. అవసరంగా మారుతోంది. ఏఐ ఎలా పనిచేస్తుంది, సరైన తీరులో ఎలా వాడాలి, వివిధ పరిశ్రమల్లో ఎలా వినియోగిస్తున్నారు ఇలా మొత్తం తెలిసి ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఏఐ సిస్టమ్స్‌తో పని చేయగలిగి ఉండేలా అవగాహన ఉండాల ని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అదే విధంగా మెషిన్‌ లెర్నింగ్‌ నుంచి ఆపరేషన్స్‌ రీసెర్చ్‌ వరకూ ఆప్టిమైజేషన్‌ అతి ముఖ్య స్కిల్‌. ఈ నిపుణులు సిస్టమ్‌ ప్రదర్శనను మెరుగు పరచగటం తో పాటుగా నిర్వహణ ఖర్చులు తగ్గించి.. ఏఐ మోడల్స్‌ పని తీరును పెంచగలదు. ఇక, డేటా సైన్స్.. ఏఐ, రిసెర్చ్‌ వంటి వాటిల్లో పనిచేసే ఇంజినీర్లకు జూపైటర్‌ ఆవశ్యకమైన టూల్‌గా మారిపోయింది. దీని ద్వారా కోడింగ్, విజువలైజేషన్, పైతాన్‌ డాక్యుమెంటేషన్‌ వంటివన్నీ సులభ తరం గ మారుతున్నాయి. ఈ నైపుణ్యాలకు సంబంధించిన కోర్సులను వివిధ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో నేర్చుకునే వీలుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+