ఏఐ వల్ల ఈ ఉద్యోగాలకు ఏ ఢోకా లేదు - జోహో శ్రీధర్

మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధస్సు (AI) ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఏంటని సర్వత్రా ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో Sridhar Vembu మరోసారి తనదైన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఏఐ అనేక రంగాలను ప్రభావితం చేసినా, మానవ అనుభూతి, సేవా దృక్పథం.. ఆత్మసంతృప్తి ఆధారంగా ఉండే ఉద్యోగాలకు ఎలాంటి ప్రమాదం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘంగా వివరించారు.

విలువను ఉద్యోగంతో ముడిపెట్టడం ప్రమాదకరం..

ఆర్థిక లాభం, హోదా లేదా మేధస్సు ఆధారంగా వ్యక్తులు తమ విలువను అంచనా వేసుకుంటే, ఏఐ వల్ల తీవ్రమైన వ్యక్తిగత సంక్షోభం ఏర్పడే అవకాశముందని వెంబు హెచ్చరించారు. యంత్రాలు మరింత తెలివిగా మారుతున్న కొద్దీ అనేక వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రాధాన్యం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా రొటీన్ అనాలిసిస్, డేటా ప్రాసెసింగ్, కోడింగ్ వంటి పనులు ఆటోమేషన్ వైపు వెళ్లే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.

zoho-sridhar-shocking-comments-about-jobs-which-are-not-affect-by-the-ai-and-goes-viral

వెంబు అభిప్రాయం ప్రకారం.. పిల్లల సంరక్షణ, వృద్ధుల సేవ, యువతకు బోధించడం, సామాజిక సేవ, ప్రకృతిని కాపాడే ఫారెస్ట్ రేంజర్ ఉద్యోగాలు, ఆలయాల్లో పూజలు చేసే పూజారులు, శాస్త్రీయ సంగీత విద్వాంసులు వంటి వృత్తులు ఏఐ వల్ల ప్రభావితం కావు. ఈ పనుల్లో భావోద్వేగం, నమ్మకం, మానవ సంబంధాలు కీలకంగా ఉండటంతో యంత్రాలు వాటిని పూర్తిగా భర్తీ చేయలేవని ఆయన వివరించారు. డబ్బు కన్నా సేవాభావం, సంతృప్తి ప్రధాన ప్రేరణగా ఉండటం కూడా ఈ ఉద్యోగాల బలమని చెప్పారు.

వెంబు వ్యాఖ్యలపై విష్ణు అగర్వాల్ అనే యూజర్ విభేదిస్తూ.. సంపద లేకుండా కళలు, సేవా రంగాలు కొనసాగడం కష్టమని అభిప్రాయపడ్డారు. దీనికి స్పందించిన వెంబు, ఏఐ వల్ల వస్తువులు, సేవల ఉత్పత్తి భారీగా పెరుగుతుందని, అసలు సమస్య ఉత్పత్తి కాకుండా పంపిణీ వ్యవస్థలో ఉందని పేర్కొన్నారు. టెక్నాలజీ సృష్టించే మిగులు సంపదను సమాజానికి సమానంగా పంచడం భవిష్యత్తులో ప్రభుత్వాలు మరియు ఆర్థిక వ్యవస్థల ముందున్న పెద్ద సవాల్ అవుతుందని చెప్పారు.

ఇతర టెక్ దిగ్గజాల అభిప్రాయాలు..

ఈ అంశంపై ఇతర టెక్ నేతలు కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. Elon Musk భవిష్యత్తులో పని అనేది ఐచ్ఛికంగా మారే అవకాశముందని, మనుషులు ఆసక్తి కోసం మాత్రమే ఉద్యోగాలను ఎంచుకునే కాలం వస్తుందని వ్యాఖ్యానించారు. మరోవైపు Jensen Huang ఏఐ ఉద్యోగాలను పూర్తిగా తొలగించదని, కానీ వాటి స్వరూపాన్ని మార్చి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు.

ఏఐ విస్తరణతో ఉద్యోగాల స్వరూపం మారుతున్నందున, భవిష్యత్తులో క్రియేటివిటీ, భావోద్వేగ నైపుణ్యాలు, కమ్యూనికేషన్, సమస్య పరిష్కార సామర్థ్యాలకు మరింత ప్రాధాన్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. టెక్నాలజీతో కలిసి పనిచేసే సామర్థ్యం ఉన్నవారికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని, జీవితాంతం నేర్చుకునే దృక్పథం కీలకమని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+