సూర్య, కార్తీ కూడా ఆయన దగ్గర శిక్షణ తీసుకున్నారు- యంగ్ హీరోపై ఆది ప్రశంసలు

ఫిల్మ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోలుగా మారిన వారు ఎందరో ఉన్నారు. తమదైన టాలెంట్ తో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకొని నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో అలా తరుణ్ నుంచి తేజా సజ్జా వరకు పలువురు ఆడియన్స్ ని మెప్పించారు. ఈ కోవాకి చెందిన వారిలో మహేంద్రన్ కూడా ఒకరు. తమిళం, తెలుగు, మలయాళం ఇలా అన్ని భాషలలో బాల నటుడుగా దాదాపు 130 సినిమాలలో నటించాడు. ఆ తర్వాత చదువుల కోసం మూవీస్ కి గ్యాప్ ఇచ్చి మళ్లీ గత కొంతకాలంగా ముఖ్యపాత్రలతో మెప్పిస్తున్నారు.

హీరోగా ఎంట్రీ..

కాగా మహేంద్రన్ హీరోగా 'నీలకంఠ' అనే సినిమాలో నటిస్తున్నారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా డైరెక్టర్రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్నా చౌదరి, నేహా పఠాన్ హీరోయిన్స్ గా నటించారు. అలానే నటి స్నేహ ఉల్లాల్ ముఖ్య పాత్రలో నటిస్తుంది. రాంకీ, బబ్లూ పృథ్వీ, శుభలేఖ సుధాకర్, చిత్రం శ్రీను వంటి నటులు ఇతర పాత్రలు పోషించారు. ఎల్ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీనివాసులు, వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రం.. న్యూ ఇయర్ కానుకగా జనవరి 2 రిలీజ్ కానుంది.

aadi-saikumar-comments-on-surya-and-karthi-at-mahendran-nilakanta-movie-event

ఈ క్రమంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ సినీ అభిమానుల మధ్య కోలాహలంగా సాగింది. యంగ్ హీరోలు ఆది సాయికుమార్, ఆకాష్ జగన్నాథ్ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు తమ మద్దతును తెలిపారు.

ఈ సందర్భంగా హీరో మహేంద్రన్ మాట్లాడుతూ ... ఆది నాకు మంచి ఫ్రెండ్. శంబాల హిట్ తో సాయికుమార్ గర్వపడేలా విజయాన్ని అందుకున్నారు. ఆకాష్ ఈ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉందని మహేంద్రన్ చెప్పుకొచ్చాడు. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేనని, తన ప్రపంచమంతా సినిమానే అని ఉద్వేగంగా చెప్పారు. కొత్త హీరోల పోటీ ఉన్నా, ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా కష్టపడుతున్నానని, ఈ సినిమా కోసం నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సహకరించారని కొనియాడారు.

హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ .. మహేంద్రన్ నాకు మంచి ఫ్రెండ్. మేము చెన్నైలో పాండియన్ అనే మాస్టర్ దగ్గర ఫైట్స్ నేర్చుకున్నాం. మాతో పాటు సూర్య, కార్తి, ఆర్య కూడా పాండియన్ దగ్గర ఫైట్స్ నేర్చుకునేవారు. మహేంద్రన్ మంచి యాక్టర్. మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి చిన్నప్పటి రోల్ లో అద్భుతంగా నటించాడు. ఈ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకురావాలి. ప్రొడ్యూసర్స్ శ్రీనివాసులు, వేణుగోపాల్, డైరెక్టర్ రాకేష్, హీరోయిన్ యష్న, ఇంకా నీలకంఠ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమాను జనవరి 2న థియేటర్స్ చూసి హిట్ చేయండి. అందరికీ హ్యాపీ న్యూఇయర్. అన్నారు.

ఫిల్మ్ కెరీర్..

1994లో కోలీవుడ్‌లోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేంద్రన్.. తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించాడు. మోహన్ బాబు నటించిన పెదరాయుడు సినిమాల్లో కనిపించాడు. అలానే ఆహా, దేవి, పెళ్లి చేసుకుందాం, నీ స్నేహం, లిటిల్ హార్ట్స్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. లిటిల్ హార్ట్స్ మూవీలో అద్భుతమైన నటనకు గాను ఉత్తమ బాలనటుడిగా నంది పురస్కారాలు సైతం సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గానే దళపతి విజయ్ "మాస్టర్" సినిమాలో యంగ్ భవాని రోల్‌లో కూడా అదరగొట్టాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+