మెగాస్టార్ చిరంజీవి 40 ఏళ్ల కెరీర్‌లో మాయని మచ్చలా మిగిలిన సినిమా ఇదొక్కటే

మెగాస్టార్ చిరంజీవి తన 40 సంవత్సరాల సుదీర్ఘ సినిమా కెరీర్ లో సంచలన రికార్డులు నెలకొల్పారు. ఇండస్ట్రీ రికార్డులు అందించారు. సూపర్ హిట్లు కొట్టారు. పోరాటాలు, నృత్యాలు, ముఖ్యంగా బ్రేక్ డ్యాన్స్ తో యువతను ఉర్రూతలూగించారు. ఇలా తన కెరీర్ లో అత్యధిక విజయాలతోపాటు అదే స్థాయిలో పరాజయాలను కూడా అందుకున్నారు. చాలా సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయో కారణం తెలియకుండానే థియేటర్ల నుంచి వెళ్లిపోయేవి. కెరీర్ మొదట్లో పర్వాలేదనిపించుకున్నప్పటికీ సుప్రీంహీరో స్థాయి నుంచి మెగాస్టార్ స్థాయికి మారిన తర్వాత కూడా దారుణమైన ఫ్లాప్ సినిమాలు పలకరించాయి. అటువంటి సినిమాల్లో ప్రధానంగా పేర్కొనేవి మూడు సినిమాలున్నాయి.

రేటింగ్ అత్యంత దారుణం

వాటిల్లో ఆచార్య, బిగ్ బాస్, మృగరాజు, భోళాశంకర్ నిలుస్తాయి. బిగ్ బాస్, మృగరాజు కన్నా ఆచార్య సినిమా అత్యంత డిజాస్టర్ గా నిలివడమేకాదు.. చిరంజీవికి ఘోరమైన అవమానాన్ని మిగిల్చింది. విశ్లేషకులు, రివ్యూవర్స్ కూడా ఈ సినిమాకు 1, 1.5 రేటింగ్ ఇచ్చారంటే ఆచార్య గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా వారం రోజులు గడవకముందే థియేటర్ల నుంచి మాయమైంది. అందులోను రామ్ చరణ్ కూడా తన తండ్రితో కలిసి ఒక పూర్తి స్థాయి పాత్ర పోషించిన సినిమా కూడా ఇదే. అయినా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. చిరంజీవికి, రామ్ చరణ్ కు మచ్చలా మారిపోయింది.

Acharya This is the only film that remains a blemish in Megastar Chiranjeevi s 40-year cinema career

రూ.100 కోట్ల నష్టాలు

బయ్యర్లు రూ.100 కోట్ల వరకు నష్టపోయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. చిరంజీవి తన కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా కొంత రెమ్యూనరేషన్‌ను కూడా వెనక్కి ఇచ్చారంటే దీని నష్టం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్ ఉన్నప్పటికీ, కథలో వేగం లేదు. పాతకాలపు సన్నివేశాలు ప్రేక్షకులను పారిపోయేలా చేశాయి. చిరంజీవి ఇమేజ్‌కు సరిపడా సన్నివేశాలు లేకపోవడం, నాసిరకం గ్రాఫిక్స్, క్లైమాక్స్ లో ఫైట్ సహజత్వానికి దూరంగా ఉండటం లాంటివన్నీ విమర్శలకు దారితీశాయి. సినిమా మొత్తం సీరియస్‌గా సాగుతుంది. చిరంజీవి మార్క్ కామెడీ లేదు. చిరంజీవి గ్రేస్ కనిపించకపోవడంతో అభిమానులనే కాదు.. సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోలేక మెగాస్టార్ కు అత్యంత చెత్త పరాజయాన్ని, అవమానాన్ని మిగిల్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+