'సైక్‌ సిద్ధార్థ' తో నందు హిట్ కొట్టేశాడా.. మూవీ ఎలా ఉందంటే ??

నటుడు నందు గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 100% లవ్, ఆటోనగర్ సూర్య, పాఠశాల, పెళ్లి చూపులు, జయ జయ జానకి నాయకా వంటి సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సోలో హీరోగా పేరు తెచ్చుకోడానికి చాలాకాలంగా కష్టపడుతున్నారు. రీసెంట్ గానే సవారీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. నటుడిగా మంచి పేరున్నా కానీ స్టోరీ సెలక్షన్ లోనే తేడా కొడుతుందనే కామెంట్స్ కూడా వచ్చాయి.

ప్రస్తుతం నందు హీరోగా నటించిన మూవీ 'సైక్‌ సిద్ధార్థ'. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించారు. ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రి, మౌనిక తదితరులు ఇతర పాత్రలు పోషించారు. నిర్మాత శ్యామ్ సుందర్ రెడ్డితో పాటు హీరో నందు కూడా ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం గమనార్హం. ఈ చిత్రం నూతన సంవత్సరం కానుకగా ఈరోజు ( జనవరి 1, 2026 ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? నందు హిట్‌ కొట్టాడా ? తెలుసుకుందాం...

actor-nandu-psych-siddardha-movie-review-and-rating

మూవీ స్టోరీ..

సిద్ధార్థ(నందు)కి ఓ రోజు పబ్‌లో త్రిష(ప్రియాంక రెబెకా శ్రీనివాస్‌)తో ప్రేమలో పడతాడు. ఆమె కోసం ఏకంగా ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని పెట్టాలనుకుంటాడు. అందుకోసం మన్సూర్‌(సుఖేష్‌ రెడ్డి)తో చేతులు కలుపుతాడు. తన వద్ద ఉన్నదంతా పెడతాడు. కొన్ని రోజులకు సుఖేష్‌ రెడ్డి, త్రిష మోసం చేసి వాళ్లిద్దరు కమిట్‌ అయి, సిద్ధార్థకి హ్యాండిస్తారు. దాంతో సిద్ధార్థ. డబ్బులు లేక పాత బస్తీలో చిన్న రూమ్‌లోకి మారిపోయి తాగుడికి బానిస అవుతాడు. మరోవైపు శ్రావ్య(యామినీ భాస్కర్‌) మేన బావని పెళ్లి చేసుకుంటుంది. అతను రోజూ చిత్ర హింసలు పెడుతుంటాడు. భర్త హింస భరించలేక కొడుకుని తీసుకుని బస్తీలో సిద్ధార్థ ఉండే ఇంట్లో కింది పోర్షన్‌లో అద్దెకు దిగుతుంది. తను క్లాసికల్‌ డాన్సర్‌. భర్త విషయంలో మోసపోయిన శ్రావ్య, ప్రియురాలి విషయంలో మోసపోయిన సిద్ధార్థ ఎలా కలిశారు? చివరికి ఏం జరిగిందనేది సినిమా.

సినిమా రివ్యూ..

ఇటీవల కాలంలో అమ్మాయిల చేత అబ్బాయిలు మోసపోవడం అనే కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. నేటి ట్రెండ్‌ని, సిటీ కల్చర్‌ని బోల్డ్ గా ఆవిష్కరిస్తూ అడపాదడపా మూవీస్‌ వస్తూ అలరిస్తున్నారు. జెంజీ ట్రెండ్‌కు తగ్గట్టు ఈ మూవీని రూపొందించారు. ఓ అమ్మాయిని చేతిలో మోసపోయిన వ్యక్తిని.. మరో అమ్మాయి ఎలా మార్చింది. అనే విషయాన్ని బోల్డ్ గా చూపించాడు దర్శకుడు. నందు పాత్ర క్రేజీగా ఉంటుంది. ప్రియురాలితో పలు సీన్లని బోల్డ్ గా చూపించారు. అలాగే ఫ్రెండ్స్ మధ్య గొడవలు కూడా బాగా చూపించారు. ఫస్టాఫ్‌ అంతా ఓ గోల లాగా రన్‌ అయినా.. సెకండాఫ్‌ని కాస్త నెమ్మదిగా నడిపించారు. క్లైమాక్స్ ని కాస్త ఎమోషనల్ గా ముగించారు. బోల్డ్ సీన్లని పెట్టడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మొత్తానికి ఈ సినిమా షార్ట్ ఫిల్మ్ కి ఎక్కువ మూవీకి తక్కువగా ఉంది. అయితే కథని మరింత ప్రాపర్‌ గాడీల్ చేసి ఉంటే యూత్‌ని మరింత ఆకట్టుకునే మూవీగా నిలిచేది.

ఎవరెలా చేశారంటే..

సిద్ధార్థగా నందు అదరగొట్టాడు. తనలోని కొత్త యాంగిల్‌ని చూపించాడడంతో పాటు నటుడిగా పరిణతి చూపిస్తున్నాడు.

శ్రావ్య పాత్రలో యామిని భాస్కర్‌ చాలా బాగా చేసింది. సెటిల్డ్ గా చేసి మెప్పించింది. ఆమెకి మంచి కమ్‌ బ్యాక్ అవుతుందని చెప్పొచ్చు.

త్రిష పాత్రలో ప్రియాంక రెబెకా కూడా ఆకట్టుకుంది.

సినిమాకి స్మరణ్‌ సాయి సంగీతం బాగుంది. బీజీఎం కూడా ఆకట్టుకుంది.

నిర్మాణ విలువలు ఫర్వాలేదు.

దర్శకుడు వరుణ్‌ రెడ్డి సినిమాని క్రేజీగా తీశాడు.

రేటింగ్‌..

2.5/ 5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+