‘అఖండ2’ రివ్యూ.. రేటింగ్ తెలుసా?

నందమూరి నటసింహం బాలకృష్ణ, పవర్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న నాలుగో చిత్రం అఖండ2. భారీ అంచనాల మధ్య ఈనెల 5న విడుదల కావాల్సిన ఈ సినిమా అనూహ్యంగా వాయిదాపడి అభిమానులను నిరాశ పరిచించింది. ఈనెల 25 లేదంటే 26 తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలోనే 5వేతదీకి ముందే కొందరు ట్రేడ్ పండితులు, సినీ విశ్లేషకులు సినిమా చూశారు. వారు చెబుతున్నదాని ప్రకారం, వారు ఇచ్చిన రేటింగ్, రివ్యూ ప్రకారం చూస్తే బాలయ్య-బోయపాటి కాంబో మరోసారి సంచలనం సృష్టిస్తున్నట్లేనని అర్థమవుతోంది. వారు ఏం చెప్పారు? ఎంత రేటింగ్ ఇచ్చారు అనే విషయాన్ని తెలుసుకుందాం.

ప్రతి సన్నివేశం ఓ వేడుక
బోయపాటి తరహా మాస్ ఎలిమెంట్స్ తో అఖండ2 తాండవం ఉంది. ఒకరకంగా వెండితెరపై అఘోరాగా బాలయ్య సింహగర్జన చేశారు. తనను చూపించిన విధానం కానీ, బాలయ్య డైలాగ్ డెలివరీ కానీ కరెంట్ షాక్ తగిలినట్లు అవుతోంది. మొదటి భాగంకన్నా రెండో భాగంలో ఈసారి ఎక్కువ ఎమోషన్స్ ఉన్నాయి. హైవోల్టేజ్ యాక్షన్ ఉంది. ఒకరకంగా ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఒక వేడుకలా ఉంది. అఖండ2 మొదటి భాగంలో విలన్ కు ఉన్న శక్తిని దర్శకుడు పరిచయం చేస్తాడు. సినిమా నెమ్మదిగా సాగుతూనే టెన్షన్ పెంచుతుంటుంది. ఆధ్యాత్మిక వాతావరణం, కథలోని ఘర్షణ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

akhanda-2-thaandavam-review-and-rating-is-4-5-out-of-5

క్లైమాక్స్ లో థమన్ బీజీఎం వింటే..
తర్వాత రెండో భాగంలోకి ప్రవేశించిన తర్వాత థమన్ బీజీఎం, మైథలాజికల్ మిక్సింగ్ తో క్లైమాక్స్ అదిరిపోయింది. అద్భుతంగా క్లైమాక్స్ తీశారు. దైవత్వాన్ని చాలా బాగా చూపించారు. ఆధ్యాత్మికంగా అత్యంత పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారు. ఒకరకంగా ప్రేక్షకులను మైమరిపించారని చెప్పొచ్చు. ఈసినిమా వెండితెరపై చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ గ్యారంటీ అని చెప్పొచ్చు. యాక్షన్ సన్నివేశాలు నాన్ స్టాప్ గా ఉంటాయి.

విజువల్ వండర్

రెండో భాగంలో అఖండ ప్రపంచం ఉరుము లేని పిడుగులా విరుచుకుపడుతుంది. విజువల్ వండర్ గా బోయపాటి దీన్ని తీర్చిదిద్దాడు. బాలయ్య ప్రశాంతంగా, ఆగ్రహంగా, ఆధ్యాత్మికంగా, రౌద్రంగా.. అన్నిరసాల మేళవింపుతో అద్భుతమైన నటన ప్రదర్శించారు. ఒకరకంగా సినిమా క్లైమాక్స్ కు థమన్ ఇచ్చిన బీజీఎం నెక్ట్స్ లెవల్ అని చెప్పాలి. యాక్షన్ సన్నివేశాలు మాత్రం స్టైలిష్ గా ఉన్నాయి.. అదే క్రమంలో రఫ్ గా కూడా ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే అఖండ2 అన్ని అంశాలు కలగలిపిన ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు.. అంటూ కొందరు సినిమా గురించి రాసుకువచ్చారు. ఒక విశ్లేషకుడు మాత్రం అఖండ2కు 5కు 4.5 రేటింగ్ ఇవ్వడం గమనార్హం.

(గమనిక: ఇది వన్‌ఇండియా తెలుగు ఇచ్చిన ఒరిజినల్ రివ్యూ కాదు. ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం మాత్రమే ఇక్కడ పొందుపర్చాం. అధికారిక రివ్యూ సినిమా విడుదల తరువాతే వన్‌ఇండియా తెలుగు పోర్టల్‌లో పబ్లిష్‌ అవుతుంది.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+